Wednesday, March 18, 2026

*ఆడబిడ్డలందరికీ ప్రభుత్వ చీరెలు ఇస్తాం: కిచ్చెన్న* ఇందిరమ్మ జయంతి నుంచి డిసెంబర్ 9 వరకు పంపిణీ.*మహిళల ఉన్నతి- తెలంగాణ ప్రగతి- ఇందిరా మహిళాశక్తి* *(మనసాక్షి ప్రతినిధి మహేశ్వరం నవంబర్ 19:)* మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జ్ కేఎల్ఆర్ మాట్లాడుతూ…రాష్ట్రవ్యాప్తంగా ఆడపడుచులందరికీ చీరెలు పంచాలని తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ గారు నిర్ణయం తీసుకోవటం హర్షనీయమని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. ఇందిరాగాంధీ 108వ జయంతి సందర్భంగా చీరెల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారని… డిసెంబర్ 9 (తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం) వరకు కొనసాగుతుందని కిచ్చెన్న తెలిపారు.తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారందరికీ మహిళా సమాఖ్య ద్వారా ప్రతీ ఆడబిడ్డకు చీరెలు అందిస్తామని లక్ష్మారెడ్డి తెలిపారు.ఇప్పటికే మహిళలకు రూ.27వేల కోట్ల వడ్డీ లేని రుణాలను అందించామని గుర్తు చేశారు. ఉచిత బస్సు ప్రయాణం, సన్నబియ్యం, విద్యుత్, రూ.500 గ్యాస్ సిలెండర్ సహా సోలార్ పవర్, ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులు ఇలా ప్రభుత్వం మహిళా సాధికారత కోసం కృషి చేస్తుందని కేఎల్ఆర్ గుర్తు చేశారు. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో అనేక పథకాల్లో భాగస్వామ్యం చేస్తున్నామని కిచెన్ అన్న గారి లక్ష్మారెడ్డి అన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News