*రైతులకు వరం ‘అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్’*•ఖాతాల్లో నగదు జమ రైతన్నకు ఆర్థిక భరోసా•రైతులకు వెన్ను దన్నుగా కూటమి ప్రభుత్వం•రైతే రాజు నినాదం కూటమి సర్కార్ తో నిజం•రైతులతో అండగా ఉంటామంటూ భరోసా•మార్కెట్ యార్డ్ లో ప్రకృతి సేద్యం స్టాల్స్ ను పరిశీలించిన ఏలూరి•ప్రకృతి వ్యవసాయం పై ప్రత్యేక ద్రుష్టి సారించి రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలి•సబ్సిడీ పై రైతుకు మినీ ట్రాక్టర్ అందచేసిన స్వయంగా ట్రాక్టర్ నడిపిన ఏలూరి•ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఏలూరి•ఆయిల్ ఫామ్ సాగు దిశగా రైతులు కదలాలి•జగన్ వంచనలతో మోసపోయిన రైతుకు.. కూటమితో నిజమైన భరోసా•అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఏలూరినేటి సాక్షి, బాపట్ల జిల్లా (పర్చూరు)రైతు జీవితానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ‘అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్’ పథకాలు వేలాది కుటుంబాలకు వరంగా మారాయని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు. బుధవారం మార్టూరు మార్కెట్ యార్డ్‌లో అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు రైతులతో ముచ్చటించారు.*రైతే రాజు నినాదం నిజం చేస్తున్న కూటమి సర్కార్*చంద్రబాబు నాయుడు తీసుకువచ్చిన అన్నదాత సుఖీభవ పథకం రైతు జీవితానికి నిజమైన అండ అని గత ప్రభుత్వం చేసినట్లుగా కేవలం పేరుకు భరోసాలు ఇవ్వకుండా, నేరుగా రైతు చేతికి సాయం అందించడమే మా ధ్యేయం” అని ఎమ్మెల్యే ఏలూరి అన్నారు.రైతే రాజు నినాదాన్ని కూటమి సర్కార్ నిజం చేస్తుందన్నారు.*ప్రకృతి సేద్యం స్టాల్స్ పరిశీలించిన ఎమ్మెల్యే ఏలూరి*మార్కెట్ యార్డ్‌లో ఏర్పాటుచేసిన ప్రకృతి సేద్యం అవగాహన స్టాల్స్‌ను ఎమ్మెల్యే ఏలూరి పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఆకుకూరల కూరగాయల స్టాల్ ని పరిశీలించి, ప్రకృతి వ్యవసాయ సిబ్బందితో మాట్లాడారు. రసాయన ఎరువుల వినియోగం తగ్గించి ప్రకృతి పద్ధతులను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని ఎమ్మెల్యే ఏలూరి వివరించారు.*రైతులకు మినీ ట్రాక్టర్ అందజేత*సబ్సిడీపై రైతుకు మినీ ట్రాక్టర్ అందజేసిన ఎమ్మెల్యే ఏలూరి స్వయంగా ట్రాక్టర్ నడిపారు.జొన్నతాలి గ్రామానికి చెందిన రైతు జాండ్రజుపల్లి యేసునాదం కి మినీ ట్రాక్టర్ ను సబ్సిడీలో అందించినట్లు తెలిపారు.రూ.5,24,879 విలువ కలిగిన ట్రాక్టర్ ను, రూ. 2,45,000 సబ్సిడీని ప్రభుత్వం అందించినట్లు ఎమ్మెల్యే ఏలూరి పేర్కొన్నారు.*ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభం*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ఏలూరి ప్రారంభించారు.మొక్కజొన్న పంటకు మద్దతు ధర ఉందని, రైతులు అధైర్య పడకుండా సాగు చేయాలన్నారు.*రైతు బాగుంటేనే దేశం*నియోజకవర్గంలో 37,861 మంది రైతులకు గాను, రూ.25.83 కోట్ల రూపాయలు ఈ పథకం ద్వారా లబ్ది జరిగిందని తెలిపారు. రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీభవ_పీఎం కిసాన్ పధకం ఇవ్వటం జరిగిందని, ప్రభుత్వం ఎంతో పవిత్రంగా బాధ్యతగా ఈ ప్రోగ్రాం చేస్తుందని తెలిపారు.రైతుల కష్టాలు కొంతైనా తీర్చేందుకు రైతులకు చెదోడు వాదోడుగా ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. రైతు బాగుంటేనే దేశం, రాష్ట్రం బాగుంటుందని ఎమ్మెల్యే తెలిపారు.రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి సీఎం చంద్రబాబు అని అందువల్లే రూ.100 కోట్ల విలువ చేసే పొగాకును ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చొరవ చూపారని ఎమ్మెల్యే ఏలూరికి తెలిపారు. ఇంకా మిగిలిన కొంత పొగాకును కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. గోడౌన్ లలో ఖాళీ లేకపోవడం వల్ల ఈ సమస్య తలేత్తిందని తెలిపారు. త్వరలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందన్నారు.*ఆయిల్ ఫామ్ సాగు దిశగా అడుగులు*రానున్న రోజుల్లో ఆయిల్ ఫామ్ పంటకు బంగారు భవిష్యత్తు ఉంటుందని అందుకు మార్టూరు, బల్లికురవ మండలాలు ఈ పంటకు అనుకులంగా ఉన్నాయన్నారు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశామని ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మార్టూరు మండలానికి ఆయిల్ ఫామ్ పంటకు ప్రోత్సహకం ఇచ్చేలా అనుమతులు ఇచ్చిందన్నారు.ఆయిల్ ఫామ్ మొక్కలు ఇవ్వటంతో పాటు,90% డ్రిప్ ఇరిగేషన్ కు సబ్సిడీ ఇవ్వటం,50% ట్రాక్టర్ సబ్సిడీ ఇవ్వటం జరుగుతుందని తెలిపారు.మొంథా తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు న్యాయం చేస్తామని, వ్యవసాయ అధికారులు రికార్డ్ చేసి ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు.రైతు ఒక్కరు కూడా నష్టపోకుండా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే ఏలూరి తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గుంజి వెంకట్రావు, నియోజకవర్గ ప్రత్యేక అధికారి లవన్న, మార్క్ఫెడ్ డిఎం కరుణ శ్రీ, ఏడీఏలు సుదర్శన్ రావు, ప్రవీణ , ఎంఆర్ఓ ప్రశాంతి, ఎంపీడీవో శ్రీనివాసరావు, హార్టికల్చర్ ఆఫీసర్ హనుమంతు నాయక్, మండల పార్టీ అధ్యక్షులు తాటి నాగేశ్వరరావు, రంగయ్య చౌదరి, నాయుడు హనుమంతరావు, పిఎసిఎస్ చైర్మన్ హనుమంతరావు దాసరి, నాయకులు ఆదినారాయణ రజాక్ జనార్ధన్, ఫారుక్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.





