నేటి సాక్షి. కొమరం భీమ్ ఆసిఫాబాద్ తెలంగాణ ముదిరాజ్ మహాసభ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు సెర్ల మురళీధర్. ఈరోజు తేదీ 19.11.2025 బుధవారం రోజున కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఇప్పల నవెగాo లో 11వ వార్షికోస్తవ వేడుకలు 21–11–2025 రోజున జరుపుకోవాలని ముదిరాజ్ జిల్లా అధ్యక్షులు సెర్ల మురళీధర్ గోడ ప్రతులు ఆవిష్కరించారు. ఆత్మ గౌరవం ఎజెండా పల్లె పల్లె కు ముదిరాజ్ జెండా ఎత్తి కొమురం భీం జిల్లా ముదిరాజలకు రావలసిన హక్కులు అభయహస్తo కామారెడ్డి BC డిక్లరేషన్ లో చెప్పిన విధముగా 42% విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించాలి. పెరిగే రిజర్వేషన్లలలో ముదిరాజ్ లకు జనాభా కు తగినట్లు మా వాటా ఇవ్వవలసిందిగా కోరుతున్నాము రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్లు బీసీలకు కల్పించాలి అభయ హస్తం లో పేర్కున్న హామీ ప్రకారం పెరిగే రిజర్వేషన్లులలో జివో. 15 తేది 19-02-2009 ముదిరాజ్ / ముత్తరాసి / తెనుగోల్లు బి.సి.డి నుండి బి.సి.ఏ పునరుద్ధరణ చేసి తక్షణమే బి.సి. ఏ లో చేర్చాలి. అన్ని జిల్లాలలో విష రిప్ సొసైటీల ఎన్నికలు పూర్తి చేయాలిమత్యసంపద దోపిడీ నివారనకొరకు మత్య సంరక్షణ చట్టం ఏర్పాటు చేయాలి. ముదిరాజ్ కార్పోరేషన్ ఏర్పాటుచేసి 1000 కోట్లు రూపాయలు కేటాయించాలి. తెలంగాణ మత్యళాకకు 3000 కోట్ల రూపాయలు కేటాయించి, వివిధ పదకాల రూపంలో మత్యకార కుటుంబాలను ఆదుకోవాలి. ప్రభుత్వ నామినేటెడ్ పోస్ట్లులో ముదిరాజు లకు అవకాశం కల్పించాలి..GO.M.S.NO 98,22:22-01-1964 (8),GO.M.S.NO.74,GO.M.S. NO.4,GO.M.S.NO.6 జీవోల ప్రకారం చెరువులు కుంటలపై మత్యసంపద పై తెనుగు / ముత్తరాసి /ముదిరాజ్, బెస్త, గంగపుత్ర మరియు గుండ్ల కులాలకు మాత్రమే హక్కులు వుండే విధముగా చట్టపరమైన ఆదేశాలు జారీ చేయవలసిందిగా ముదిరాజ్ జిల్లా అధ్యక్షులు సెర్ల మురళీధర్ కోరుతున్నారూ.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు.1) పులి సతీష్ – మండల అధ్యక్షులు 2) బోడ్ల శ్రీను 3) గుమ్ముల బాలేష్ 4) ఏటకార్ల రవి 5) శ్రీకాంత్





