Thursday, March 19, 2026

*అద్భుత భవిష్యత్తుకు బంగారు బాటలు*•మార్టూరులో మెగా జాబ్ మేళాకు విశేష స్పందన•విద్యార్థుల చెంతకు కార్పొరేట్ కంపెనీలు•నైపుణ్యాన్ని పెంచుకొని ఉద్యోగాలకు సిద్ధం కావాలి •సమర్థవంతమైన నేత సీఎం చంద్రబాబు •20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రభుత్వం లక్ష్యం •గత ఐదేళ్లు నిర్లక్ష్యానికి గురైన యువత •రాజధానికి సమీపంలో ఉన్నాం రానున్న రోజుల్లో మెరుగైన అవకాశాలు •జాబ్ మేళాలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు నేటి సాక్షి, బాపట్ల జిల్లా (పర్చూరు)నవ్యాంధ్రలో యువతకు అద్భుత భవిష్యత్తుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సారధ్యంలో కూటమి ప్రభుత్వం బంగారు బాటలు వేస్తుందని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు. శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మార్టూరు పట్టణంలోని శ్రీహర్షిని డిగ్రీ కళాశాలలో నిర్వహించిన మెగా జాబ్ మేళా ఉత్సాహభరితంగా సాగింది. ఎన్నో జిల్లాల నుంచి వేలాదిగా వచ్చిన విద్యార్థులు, అభ్యర్థులు కార్పొరేట్ కంపెనీల నియామక ప్రక్రియల్లో పాల్గొంటూ కళాశాల ప్రాంగణం సందడిగా మారిందిఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ గత ఐదేళ్లు రాష్ట్రంలో యువత పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యారన్నారు. ప్రభుత్వ అవకాశాలు నిలిచిపోయాయి. ప్రైవేట్ ఉద్యోగాలు రాక ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల నిరుద్యోగ యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయకత్వంలో యువతకు స్వర్ణయుగం ప్రారంభమైందన్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన.”ప్రభుత్వ లక్ష్యం అన్నారు.అలాగే యువతను ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఉద్యోగం రాకపోతే నిరాశపడకండి. మీ వద్ద ఉన్న నైపుణ్యాలను పెంచుకొని అవకాశాలను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే ఏలూరి పిలుపునిచ్చారు.స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రతి యువత భవిష్యత్తును తీర్చిదిద్దుతుందని తెలిపారు.*రాజధాని సమీపం – పర్చూరు యువతకు మరిన్ని అవకాశాలు*పర్చూరు నియోజకవర్గం రాజధానికి సమీపంలో ఉండటం వల్ల భవిష్యత్తులో పరిశ్రమలు, ఐటీ విభాగాలు పెద్దఎత్తున అభివృద్ధి చెందనున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.రానున్న రోజుల్లో విద్య, పరిశ్రమలు, ఉద్యోగాలు అన్నీ మన పరిసర ప్రాంతాల్లోనే విస్తరించనున్నాయని పేర్కొన్నారు.యువత నైపుణ్యాలను పెంచుకొని ఉద్యోగ అవకాశాల కోసం సిద్ధంగా ఉండాలని అన్నారు.16 జాతీయ కంపెనీలుదేశవ్యాప్తంగా పేరుప్రఖ్యాతి గల 16 జాతీయ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొని నియామక ప్రక్రియను నిర్వహించాయి.ఐటీ, మార్కెటింగ్, హెల్త్‌కేర్, సేల్స్, మేనేజ్‌మెంట్, ప్రొడక్షన్, సర్వీసెస్ వంటి అనేక విభాగాల్లో వందలాది ఉద్యోగాలను ప్రకటించడంతో అభ్యర్థుల్లో ఉత్సాహం నెలకొంది.కంపెనీల ప్రతినిధులు యువతలో కనిపించిన నైపుణ్యాలు, ప్రతిభను అభినందించారు. ఎంపికైన అభ్యర్థులకు మేళా ప్రారంభంలోనే ఆఫర్ లెటర్లు అందజేయడం విశేషం.*యువత ఉత్సాహం – నిర్వాహకుల సంతృప్తి*జాబ్ మేళాలో పాల్గొన్న విద్యార్థులు, అభ్యర్థులు తమ నైపుణ్యాలను ప్రదర్శించుకోవడానికి లభించిన అవకాశంపై ఆనందం వ్యక్తం చేశారు.ఈ మేళా ద్వారా పర్చూరు నియోజకవర్గంతో పాటు సమీప మండలాల యువతకు మంచి ఉపాధి అవకాశాలు లభించాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో హర్షిని కళాశాల కరస్పాండెంట్ గోరంట్ల రవికుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ గుంజి వెంకటరావు, నియోజకవర్గ ప్రత్యేక అధికారి లవన్న ,రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ మేనేజర్ మాధవి, ఉన్నతాధికారులు, కళాశాల నిర్వాహకులు, అధ్యాపకులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News