Thursday, March 19, 2026

మానుకోట కు అన్యాయం జరిగితే మేం..చూస్తూ.. ఊరుకోం…!!!వచ్చిన రైల్వే ప్రాజెక్ట్ వెనక్కి తీసుకుపోయే కుట్ర జరుగుతుంటే ఈ..ప్రాంత ప్రజాప్రతినిధులు నిదురపోతున్నారా…!! వరంగల్ యంపి కడియం కావ్య మానుకోట కు మంజూరైన భారీ రైల్వే ప్రాజెక్టును తరలించే పనిలో ఉంటే.., ఇక్కడ యంపి, ఎమ్మెల్యే ఏం.‌..చేస్తున్నట్లు..!!మానుకోట చరిత్ర తెలుసు కదా..!! తిరుగుబాటు ప్రారంభం కాక ముందే మీ..మౌనం వీడండి…!!ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమందికి ఉపాధి కల్పించే రైల్వే మెగా మెయింటనెన్స్ డిపో ప్రాజెక్టు పనులను మహబూబాబాద్ లో వెంటనే ప్రారంభించాలి…మానుకోట అభివృద్ధి కోసం, ప్రాజెక్టుల మంజూరు కోసం, మన ప్రజల సంక్షేమం కోసం, భవిష్యత్ తరాల బాగుకోసం అందరం ఆలోచించాలి..!! అంతే తప్పా వచ్చిన భారీ ప్రాజెక్టులు కూడా వలసపోతుంటే మీరు మౌనంగా ఉండగలరేమో కానీ..!! మేము మాత్రం సహించలేము..తరలింపుకు అడ్డుగా నిలబడుతాం..! ప్రజలను సమీకరిస్తాం..!!మానుకోట అభివృద్ధి కోసం ఎవరితోనైనా కలబడుతాం..🔥🔥-మహబూబాబాద్ లో మీడియా సమావేశంలో మండిపడ్డ ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News