Saturday, March 21, 2026

*గత వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది : ఎమ్మెల్యే పులివర్తి నాని.* *ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చింది .**పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమపధకాలు అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారులకు అందేలా స్థానిక నాయకులు చూడాలి .**కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు… చేతల ప్రభుత్వమని తెలిపిన ఎమ్మెల్యే .**ప్రతీ నెల 1వ తేదీ క్రమం తప్పకుండా ఎన్టీఆర్ భరోసా పింఛను పంపిణీ చేస్తున్న కూటమి ప్రభుత్వం.**చంద్రగిరి మండలంలో 8292 మందికి పెన్షన్లు మంజూరైనట్లు దానికోసం 3 కోట్ల 41 లక్షల 86వేల రూపాయలు మంజూరైందని… బుచ్చినాయుడుపల్లి పంచాయతీలో 385 మందికి 15 లక్షల 98 వెలరూపాయలు మంజూరైనట్లు తెలిపిన ఎమ్మెల్యే*.నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)చంద్రగిరి,గత వైసిపి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని… కూటమి ప్రభుత్వం రాకతో రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కోసం ప్రపంచ దిగ్గజ సంస్థలతో ఒప్పందాలు ఏర్పరుచుకుని ఆర్థిక రాబడిని రాబట్టి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మన అధినాయకులు గాడిలో పెడుతున్నారని ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. ప్రభుత్వం ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి డిసెంబర్ 1వ తేదీ ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ ను అవ్వ, తాత, వికలాంగులకు ఎమ్మెల్యే పులివర్తి నాని గారి చేతుల మీదుగా చంద్రగిరి మండలం పరిధిలోని బుచ్చినాయుడుపల్లి పంచాయతీ హరిజనవాడలో అధికారులు, స్థానిక కూటమి పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే గారే స్వయంగా లబ్ధిదారుల ఇండ్ల వద్దకు వెళ్లి పింఛను పంపిణీ చేసి…. కాలనీలోని సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. చంద్రగిరి మండలంలో డిసెంబర్ నెలలో 15 నూతన పింఛన్లు మంజూరు చేసిందని తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గంలో 100% పింఛను పంపిణీ పూర్తి చేయడానికి అధికారులు సహకరించాలని కోరారు. ప్రజల కష్టాలు, సమస్యలు తెలిసినవారు కాబట్టే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి నెల క్రమం తప్పకుండా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేయడం జరిగుతుందని ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. కక్షపూరితమైన రాజకీయాలకు తావు లేకుండా చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే గారు తెలిపారు. కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు… చేతల ప్రభుత్వమని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News