*నేటి సాక్షి, గుంటూరు జిల్లా ప్రతినిధి ప్రజా సమస్య ఏదైనా సరే వెంటనే పరిష్కారం చేసే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే గళ్ళ మాధవి అన్నారు.గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి 39వ డివిజన్‌లో పర్యటించారు. బుధవారం ప్రజా గ్రీవెన్స్‌లో నమోదైన సమస్యలను, డివిజన్ కు నేరుగా వెళ్లి ప్రత్యక్షంగా పరిశీలించారు. మారుతీ నగర్, నాయీ బ్రాహ్మణ కాలనీ పరిధిలో రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు, ఆక్రమణలు వంటి పలు సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. మారుతీ నగర్ 5వ లైన్‌లో రోడ్డుకు సంబంధించిన ఆక్రమణల పై స్థానిక ప్రజలు ఎమ్మేల్యే గళ్ళా మాధవి దృష్టికి తీసుకొని వచ్చారు.అలాగే మారుతీ నగర్ బి సి కమ్యూనిటీ హాల్‌ను పరిశీలించి, హాల్‌కు సంబంధించిన టెండర్ వివరాలను సేకరించి తనకు అందించాలని అధికారులను ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆదేశించారు. ముస్లింల స్మశాన వాటిక వద్ద జంగిల్ క్లియరెన్స్‌ను ఒక వారంలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రైల్వే ట్రాక్ రోడ్‌కు 3 మీటర్ల రోడ్ మంజూరు పై అధికారులతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. దూళిపాళ్ల ఆర్చి వద్ద రెండు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించడమే కాకుండా, మారుతీ నగర్‌లో కొన్నిచోట్ల వీధి దీపాలు లేకపోవడంతో అవి వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో సింగంశెట్టి వీరయ్య,రుస్తుం బాబు,రఫీ, ఈశ్వరు, కొండబోయిన శ్రీనివాస్, అబ్దుల్ ఖాదర్ బుడే, మస్తాను, మేరయ్య తదితరులు పాల్గొన్నారు.

