వైభవంగా శ్రీశ్రీశ్రీ కడప రాయుడు జాతర మహోత్సవాలు తరలి వచ్చిన భక్తులు… నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండల పరిధిలోని గుడ్ముకుల గ్రామంలో వెలిసిన శ్రీశ్రీశ్రీ కడప రాయుడు స్వామి వారి జాతర మహోత్సవాలు గురువారం కన్నుల వైభవంగా నిర్వహించారు. కడప రాయుడు ఉత్సవాల సందర్భంగా ధన్వాడ,, మరికల్ మక్తల్, ఊట్కూర్, నారాయణపేట, దామరగిద్ద మద్దూర్ నర్వా వివిధ మండలాల్లోని వివిధ గ్రామాల భక్తులు భారీ సంఖ్యలో జాతర మహోత్సవాలకు హాజరయ్యారు. జాతర సందర్భంగా భక్తులు మొక్కుబడులను నేర్చుకున్నారు.





