Saturday, March 21, 2026

*_ప్రజలను భాగస్వాములను చేస్తూ అభివృద్ధి పనులకు ఎటువంటి ఆటంకం కలగకుండా త్వరితగతిన పనులను చేపట్టాలి: బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ గారు…_*ఈరోజు జీహెచ్ఎంసీ జంట సర్కిలైన కుత్బుల్లాపూర్ & గాజులరామారం సర్కిల్ మున్సిపల్ కార్యాలయాలలో నూతనంగా చేపట్టనున్న అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే గారు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా గాజులరామారం సర్కిల్ పరిధిలో వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం 10 కోట్ల రూపాయలు మంజూరు కాగా, కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని పలు కాలనీలలో 3.50 కోట్ల రూపాయలు మంజూరవగా, జంట మున్సిపల్ సర్కిల్లో పరిధిలోని పలు కాలనీలలో చేపట్టవలసిన రోడ్డు నిర్మాణ పనులు, స్మశాన వాటికల అభివృద్ధి పనులు, పార్కుల అభివృద్ధిపై ఎమ్మెల్యే గారు అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…. మంజూరైన నిధులతో నూతనంగా చేపట్టనున్న సీసీ రోడ్డు, స్మశానవాటికల అభివృద్ధి, పార్కుల అభివృద్ధి వంటి పనులలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ అభివృద్ధి పనులకు ఎటువంటి ఆటంకం కలగకుండా త్వరితగతిన పనులను చేపట్టి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ సమీక్షా సమావేశంలో గాజుల రామారం ఉప కమిషనర్ మల్లారెడ్డి, కార్పొరేటర్లు జగన్, మంత్రి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, ఇంజనీరింగ్ విభాగం ఈఈ లు, డీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News