రష్యన్ ప్రెసిడెంట్ ఇండియా పర్యటనలో ఉన్న సమయంలో ఈ రకమైన పరిస్థితి ఏర్పడటం దారుణం..ఇండిగో సర్వీస్ల రద్దుతో అనేక మంది ఆన్లైన్ పెళ్లిళ్లు చేసుకోవాల్సిన దుస్థితి.. మార్గాని భరత్నేటి సాక్షి పత్రిక పాత్రికేయులు శర్మ, అన్నమయ్య జిల్లా, డిసెంబర్ 08 ~అన్నమయ్య జిల్లా :-: వందలాది ఇండిగో సర్వీసులు రోజూ రద్దవుతున్నా విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఏం చేస్తున్నారని మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రశ్నించారు. పలు విమానయాన శాఖ మంత్రి పీరియాడిక్ రివ్యూలు ఎప్పుడు నిర్వహించారని నిలదీశారు. రోజు కి 2300 ఇండిగో సర్వీసులు నడుస్తున్నాయని, అదే సమయంలో వందలాది సర్వీసులు కూడా రద్దవుతున్నాయన్నారు. నిబంధనల ప్రకారం ఇండిగోకు మరో 900 మంది పైలట్ల అదనంగా ఉండాలన్నారు. నిబంధనలను అడ్డగోలుగా అమలు చేయాలని కోరడం తప్పితే, క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఎందుకు సమీక్షించలేదన్నారు. ఇండిగో నిబంధనలు పట్టించుకోనప్పుడు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఏం చేస్తుందని మార్గాని భరత్ ప్రశ్నించారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని రామ్మోహన్ నాయుడు మంట గలిపారని, ఇండిగో సమస్యను నారా లోకేష్ ఏరకంగా పర్యవేక్షిస్తారన్నారు. ప్యాసింజర్ల భద్రతను గాలికి కొదిలేశారని, జరగకూడని ప్రమాదాలు జరిగితే రీల్స్ మంత్రి సమాధానం చెబుతారా అంటూ మార్గాని భరత్ ప్రశ్నించారు. అహ్మదాబాద్ ఫ్లైట్ చేదు అనుభవం ఇంకా మర్చిపోలేదన్నారు. రష్యన్ ప్రెసిడెంట్ ఇండియా పర్యటనలో ఉన్న సమయంలో ఈ రకమైన పరిస్థితి ఏర్పడటం దారుణమని కేంద్ర మంత్రి నిర్లక్ష్య ధోరణి ఈ ఘటనతో బయటపడిందని ఇండిగో సర్వీసులు రద్దుతో అనేక సమస్యలు ఏర్పడుతున్నాయని ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారని షిల్లాంగ్ లో భర్త చనిపోయిన మహిళ కాఫిన్ బాక్స్ తో ఎయిర్ పోర్టు లోనే 48 గంటలు నిలిచిపోవడం దారుణమని ఇండిగో సర్వీస్ల రద్దుతో అనేకమంది ఆన్లైన్ పెళ్లిళ్లు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని మార్గాని భరత్ మండిపడ్డారు.~~~~~~~~~~~~~~~~~~





