Friday, March 20, 2026

*ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు అధ్యాపకుల అభినంద సభ*ఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు సాంస్కృతిక వారధులు ఐక్యతా మరియు క్రమశిక్షణ పెంపొందుతుంది గుజరాత్ లో ని సర్దార్ పటేల్ యూనివర్సిటీ లో ఏడు రోజుల పాటు నిర్వహించిన జాతీయ ఐక్యతా క్యాంప్ లో పాల్గొన్న దుర్గం మహేశ్వరి కి ఈరోజు కళాశాల విద్యార్థులు, ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు, అధ్యాపకులు కలిసి అభినందన సభను ఏర్పాటు చేశారు. కరీంనగర్ లోని శాతవాహన విశ్వవిద్యాలయం ఎన్. ఎస్. ఎస్. ప్రోగ్రాం కోఆర్డినేటర్ మరియు ఖని యూనివర్సిటీ పీ జీ కళాశాల ప్రిన్సిపల్ డా. ఈ మనోహర్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ… విద్యార్థి దశలో ఎన్. ఎస్. ఎస్. ద్వారా ఐక్యతా మరియు క్రమశిక్షణ అలవాటు చేసుకుంటే జీవితాంతం విజయ పథంలో ముందుంటారు అని అన్నారు. జాతీయ ఐక్యతా క్యాంప్ లో పాల్గొనడం ద్వారా భారత దేశంలో ని అనేక సంస్కృతుల కలయికను ఒకే వేదిక మీద చూడొచ్చు అన్నారు. అనేక భాషల తో పరిచయం అవుతుంది అన్నారు. ఇంటిగ్రేషన్ క్యాంప్ వలన ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ యొక్క దివ్యమైన రూపం సాక్షాత్కరిస్తుంది అన్నారు. కాబట్టి వాలంటీర్లు ఇటువంటి సువర్ణ అవకాశాన్ని అంది పుచ్చుకోని సద్వినియోగం చేసుకోవాలన్నారు. తను వరంగల్ కే డీ సీ లో డిగ్రీ చదువుకున్న రోజుల్ని, వారి గురువు సుధాకర్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. మహేశ్వరిని అభినందిస్తూ మహేశ్వరి ఎన్. ఐ. సీ లో పాల్గొనడం ద్వారా మన గోదావరిఖని యొక్క యాస భాషతో పాటు తెలంగాణ సంస్కృతి ని భారత దేశం నలుదిశల వ్యాపింపజేయడంలో తనవంతు బాధ్యతను నిర్వర్తించింది అన్నారు. జన్మ నిచ్చిన తల్లిదండ్రులకు పిల్లలు ఇటువంటి సన్మానాలు ఎనలేని గౌరవాన్ని అందిస్తుంది అన్నారు. మహేశ్వరి ఎన్. ఎస్. ఎస్ ఇచ్చిన ప్రోత్సాహం తో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందనే ఆశా భావాన్ని వ్యక్త పరిచారు. విద్యార్థులు తమ టీచర్ తోను తల్లిదండ్రులతోను సమయాన్ని వెచ్చించాలని సందేశమిచ్చారు. సన్మాన గ్రహీత దుర్గం మహేశ్వరి మాట్లాడుతూ… ఎన్. ఐ. సీ లో పాల్గొనే సువర్ణ అవకాశాన్ని కల్పించిన శాతవాహన విశ్వవిద్యాలయం NSS ప్రోగ్రాం కోఆర్డినేటర్ డా మనోహర్ గారికి మరియు కళాశాల ప్రిన్సిపల్ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసింది. క్యాంప్ లో పాల్గొనడం ద్వారా భారతీయతలోని ఆప్యాయత, అనురాగం, సోదరభావం, ఐక్యతా భావం తెలిసొచ్చింది అన్నారు. గుజరాత్ లో ని సర్దార్ పటేల్ యూనివర్సిటీ మరియు స్టాచ్యూ ఆప్ యూనిటీ ఎంతో స్ఫూర్తినిచ్చిది అన్నారు. ఎన్. ఎస్. ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ మరియు వైస్ ప్రిన్సిపల్ ఏ సాంబశివ రావు, ఇతర ప్రోగ్రాం ఆఫీసర్లు డా ఎం నరేష్ డి కిరణ్మయి దుర్గం. మహేశ్వరి కి అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. తదనంతరం ముఖ్య అతిథి డా మనోహర్ దుర్గం మహేశ్వరి కి మరియు తల్లికి పుష్ప గుచ్చం అందజేసి శాలువాతో సత్కరించి, మెమెంటో అందజేశారు. తోటి వాలంటీర్లు తమ ఆనందాన్ని వ్యక్త పరిచి హర్షాతిరేకాలు చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News