- ఎమ్మెల్యే ను వేడుకుంటున్న మైలారం రైతులు
నేటిసాక్షి,గన్నేరువరం,(బుర్ర అంజయ్య గౌడ్):
పంటలు ఎండిపోకుండా కాపాడండని పలువురు రైతులు గన్నేరువరం మండలంలోని కూనవానిపల్లె నుండి మైలారం కి వేసినటువంటి సాగునీటి కాలువ 3R-D8 నిరూపయోగంగా మారిందని ఈ కాలువ ద్వార వచ్చే నీటిని నమ్ముకొని పలువురు రైతులందరు ముఖ్యంగా మైలారం గ్రామ రైతులు వరి నాటు వేయటం జరిగిందని ఈ కాలువలో మట్టి కూడుకుపోయి, మొత్తం చెట్లు మొలిచి నీటి ప్రవాహం నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడిందని, ఇలాగే కొనసాగుతే రైతుల పంటలు ఎండిపోయి పెట్టిన పెట్టుబడి కూడ నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని స్థానిక సమస్య కావున మానకొండూర్ శాసన సభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ చొరవ తీసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే కాలువను ఉపయోగంలోకి తీసుకువచ్చి రైతులను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.




