Tuesday, March 17, 2026

రుద్రంగి మండలానికి 40 లక్షలు సిఆర్ఆర్ నిధులు మంజూరు

  • హర్షం వ్యక్తం చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ చెలకల తిరుపతి

నేటి సాక్షి ప్రతినిధి, రుద్రంగి ( కోక్కుల వంశీ ) : వేములవాడ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధిలో భాగంగా రుద్రంగి మండలంలోనీ పలు గ్రామాల్లో నూతన సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ ల నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క చొరవతో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కృషీతో 40 లక్షలు సిఆర్ఆర్ (ఎస్సిపీ) నిధులు మంజూరు కావడం జరిగిందని సీసీరోడ్లు, సైడ్ డ్రైన్ ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ చెలకల తిరుపతి ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, మంత్రి సీతక్కకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ చేలకల తిరుపతి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడి 14 నెలల కాలంలో ప్రభుత్వ విప్ రుద్రంగి బిడ్డ వేములవాడ శాసనసభ్యులు శ్రీనివాస్ రుద్రంగి మండల కేంద్రానికి సుమారు రెండు మూడు కోట్ల నిధులతో రుద్రంగి మండలాన్ని అభివృద్ధి పథంలో ముందు వరుసలో నిలిపారన్నారు. సిసి రోడ్ల నిర్మాణం, డ్రైనేజ్, సెంట్రల్ లైటింగ్, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్, ప్రభుత్వ ఆసుపత్రి, కలిగోట సూరమ్మ చెరువు ప్రాజెక్టు నిర్మాణం, ఇందిరా చౌక్ నుండి వడ్డెర కాలనీ వరకు సిసి రోడ్డు నిర్మాణం, ఆలాగ అనేక అభివృద్ధి పనులు చేసిన ఆది శ్రీనివాస్ కు రుద్రంగి ప్రజలు ఎల్లవేళలా రుణపడి ఉంటారన్నారు. ఇట్టి నిధుల పట్ల ప్రజలు పెద్ద ఎత్తున వ్యక్తం చేస్తున్నారు. వడ్డించేవాడు మనవాడైతే తిండికి కొదవ లేనట్టు ఆది శ్రీనివాస్ రుద్రంగి ముద్దుబిడ్డ కావడంతో రుద్రంగి రానున్న రోజులో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ప్రజలు ఆశిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News