దేశ రాజకీయాల్లో అజాత శత్రువు వాజపేయి** స్వర్ణ చతుర్భుజి ద్వారా దేశ రూపు రేఖల్ని మార్చారు* వాజపేయి స్పూర్తితో దేశాన్ని అభివృద్ధి చేస్తున్న ప్రధాని మోదీ* ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్నేటి సాక్షి,బాపట్ల జిల్లా ప్రతినిధి దేశ రాజకీయాల్లో మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజపేయి అజాత శత్రువు గుర్తింపు పొందారని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కీర్తించారు. అటల్ సందేశ్ – మోదీ సుపరిపాలన యాత్ర మంగళవారం నాడు బాపట్ల చేరుకున్న సందర్భంగా మంత్రులు అనగాని సత్య ప్రసాద్, కొలుసు పార్థ సారధితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ తో కలిసి వాజపేయి కాంస్య విగ్రహాన్ని బాపట్లలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ.. లోక్ సభకు 9 సార్లు, రాజ్యసభకు రెండు సార్లు ఎన్నిక కావడమే కాకుండా, మూడుసార్లు దేశ ప్రధానిగా ప్రజలకు ఎనలేని సేవ చేసిన భరతమాత ముద్దు బిడ్డ వాజపేయి అని కొనియాడారు. ఒక్క ఓటుతో ప్రధాని పదవికి దూరమైనా., హుందాగా పదవి నుంచి తప్పుకుని వంద కోట్ల భారతీయుల మనసు గెలిచారని మంత్రి గొట్టిపాటి గుర్తు చేశారు. దేశంలో జాతీయ, గ్రామ రహదారుల అభివృద్ధి వంటి మౌలిక వసతులు ఏర్పాటు ద్వారానే దేశ సత్వర సర్వతో ముఖాభివృద్ధి సాధ్యమని నమ్మి స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టును ప్రారంభించారని ఆయన వెల్లడించారు.కాశ్మీర్ నుంచి కన్యా కుమారి వరకు రహదారులను నిర్మించిన మాజీ ప్రధాని వాజపేయి.. స్వాతంత్య్రం తరువాత నవ, యువ భారత్ నిర్మాణంలో కీలక భూమిక పోషించారని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. 8 లక్షల కిలోమీటర్ల గ్రామీణ రోడ్లతో పాటు, 5 వేల కిలోమీటర్ల జాతీయ రహదారులను దశాబ్ధాల క్రితమే నిర్మించారని తెలిపారు. రాజకీయాల కంటే దేశ అభివృద్ధి ముఖ్యమని భారతరత్న వాజపేయి భావించారని మంత్రి స్పష్టం చేశారు. 23 రాజకీయ పార్టీలను ఒక తాటిపైకి తేవడమే కాకుండా మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం ను దేశ రాష్ట్రపతిని చేసిన ఘనత కూడా వాజపేయిదే అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే మాజీ ప్రధాని వాజపేయి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయన్నారు. వాజపేయి ఆదర్శాలను, ఆశయాలను స్పూర్తిగా తీసుకున్న, ప్రధాని నరేంద్ర మోదీ కూడా వందే భారత్ ద్వారా రైల్వేల అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారని కొనియాడారు. వాజ్ పేయ్ కాంస్య విగ్రహం ఆవిష్కరణలో పాల్గొనడం తన జీవితంలో మరపురాని ఘట్టమని మంత్రి గొట్టిపాటి హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.[16/12, 6:41 pm] Naimulla Bapatla: *గ్రామాల అభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయం*•తారు రోడ్లతో గ్రామీణ రహదారులకు కళ•శరవేగంగా బొల్లాపల్లి రహదారి నిర్మాణం•ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావునేటి సాక్షి,బాపట్ల జిల్లా (పర్చూరు)గ్రామాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు స్పష్టం చేశారు. గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతోందని తెలిపారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అందులో భాగంగా జాతీయ రహదారి ఎన్హెచ్–16 నుంచి బొల్లాపల్లి గ్రామానికి రూ.65 లక్షల వ్యయంతో తారు రోడ్డు మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. ఈ రోడ్డు నిర్మాణ పనులు ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతున్నాయని, నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా పూర్తి చేయాలని అధికారులకు సూచనలు చేశారు.ఈ తారు రోడ్డు నిర్మాణంతో గ్రామాల మధ్య రవాణా సౌలభ్యం గణనీయంగా పెరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. ముఖ్యంగా రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు సులభంగా తరలించుకునే అవకాశం కలుగుతుందని, విద్యార్థులు విద్యా సంస్థలకు వెళ్లేందుకు అనుకూలంగా మారుతుందని తెలిపారు. అలాగే అత్యవసర సేవలు గ్రామాలకు వేగంగా చేరుకునే అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు.గ్రామీణ రహదారుల అభివృద్ధి వల్ల గ్రామాల రూపురేఖలు మారుతాయని ఏలూరి సాంబశివరావు అన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని, ప్రతి గ్రామం అభివృద్ధి బాటలో నడవాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.భవిష్యత్తులో కూడా రహదారులు, తాగునీరు, విద్య, వైద్యం వంటి ప్రాథమిక మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం మరింత కృషి చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే తమ ధ్యేయమని ఎమ్మెల్యే ఏలూరి అన్నారు.





