ప్రమాణస్వీకారం చేసిన మందిపల్లి గ్రామ సర్పంచ్ సురేందర్ రెడ్డి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ధర్మ సమాజ్ పార్టీ ఉప సర్పంచ్ గా చెట్టుకింద రమేష్…. నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల పరిధిలోని మంది పల్లి గ్రామ సర్పంచ్ గా సురేందర్ రెడ్డి సోమవారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. అదేవిధంగా మందపల్లి గ్రామ ఉపసర్పంచ్ గా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ధర్మ సమాజ్ పార్టీ నుండి ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా గ్రామపంచాయతీ మిగతా వార్డు సభ్యులు అధికారుల ద్వారా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మందపల్లి గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు , మహిళలు యువజన సంఘాల నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.





