పత్రిక ప్రకటనకుంరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాతేదీ : 29-12-2025గంజాయి నిర్మూలనలో విశేష కృషి చేసిన పోలీస్ అధికారులకు నగదు రివార్డులు అందించిన జిల్లా ఎస్పీ నితిక పంత్ ఐపీఎస్నేటి సాక్షి,కుంరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పరిధిలో 2025 సంవత్సరంలో ప్రభుత్వ నిషేధిత గంజాయి మొక్కలను గుర్తించి స్వాధీనం చేసుకోవడంలో విధుల పట్ల బాధ్యత, నిబద్ధతతో విశేష కృషి చేసిన పోలీస్ అధికారులు మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీమతి నితిక పంత్ ఐపీఎస్ గారు ప్రత్యేకంగా అభినందించారు.ఈ సందర్భంగా ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయం నందు నిర్వహించిన కార్యక్రమంలో, గంజాయి సాగు, అక్రమ రవాణా నిరోధానికి కృషి చేసిన అధికారులకు మరియు సిబ్బందికి నగదు రివార్డులు అందించారు.ఈ కార్యక్రమంలో ఎస్పీ గారు మాట్లాడుతూ,… “సమాజానికి ముప్పుగా మారుతున్న గంజాయి వంటి మత్తు పదార్థాల నిర్మూలనలో జిల్లా పోలీస్ శాఖ అంకితభావంతో పనిచేయడం అభినందనీయం. ప్రజల భద్రతే లక్ష్యంగా పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి” అని తెలిపారు. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇదే విధమైన అంకితభావం, చిత్తశుద్ధి, క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తూ గంజాయి రహిత జిల్లాగా ఆసిఫాబాద్‌ను తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ గారు సూచించారు.

