మార్కెట్ కమిటీ చైర్మన్ ను సన్మానించిన కాగజ్‌నగర్ ప్రెస్ క్లబ్నేటి సాక్షి, కొమరం భీం ఆసిఫాబాద్ కాగజ్‌నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో, నూతన చైర్మన్ ఇరుకుల్ల మంగ ను కాగజ్‌నగర్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ సభ్యులు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇరుకుల్ల మంగ ను శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో కాగజ్ నగర్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా reg (259) ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అహ్మద్ పాషా, ప్రధాన కార్యదర్శి ఈర్లా సతీష్, మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధిలోనూ, రైతుల సంక్షేమంలోనూ నూతన చైర్మన్ చొరవ చూపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా మార్కెట్ కమిటీని ముందుకు తీసుకెళ్లాలని వారు కోరారు.తమను కలిసి సన్మానించినందుకు చైర్మన్ మంగ ప్రెస్ క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

