పత్రికా ప్రకటనకుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాతేదీ: 30-12-2025లింగాపూర్ జాతరలో అక్రమ లాటరీ ఆట – ఇద్దరి అరెస్ట్— జిల్లా ఎస్పీ నితికా పంత్, ఐపీఎస్నేటి సాక్షి, కొమురం భీం ఆసిఫాబాద్ లింగాపూర్ గ్రామం మరియు మండల పరిధిలో నిర్వహిస్తున్న జాతర సందర్భంగా అక్రమంగా లాటరీ ఆటలు నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను సీసీఎస్ (CCS) బృందం ఈరోజు మధ్యాహ్నం అదుపులోకి తీసుకుంది.అరెస్టు అయిన వారి వివరాలు:ఆదే అర్వింద్, తండ్రి: శేషారావు, నివాసం: లింగాపూర్.చవాన్ శివ, తండ్రి: దిగంబర్, నివాసం: లింగాపూర్.వారి వద్ద నుండి అక్రమ లాటరీ ఆటకు ఉపయోగిస్తున్న సామగ్రి అయిన లాటరీ గేమ్ షీట్, 12 డైసులు (పాచికలు), 2 స్టీల్ బౌల్స్తో పాటు రూ. 3,240/- నగదును స్వాధీనం చేసుకున్నారు.స్వాధీనం చేసుకున్న సామగ్రి మరియు నగదును తదుపరి చర్యల నిమిత్తం లింగాపూర్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించడం జరిగింది.ఈ దాడిలో పాల్గొన్న సిబ్బంది:రాజు కంధూరి,పోలీస్ కానిస్టేబుల్స్: సంజీవ్, దేవేందర్.జిల్లాలో ఎక్కడైనా అక్రమ జూదం లేదా లాటరీ ఆటలు నిర్వహించినట్లయితే సంబంధిత వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ నితికా పంత్ ఐపీఎస్ హెచ్చరించారు

