Monday, March 16, 2026

*-42శాతం రిజర్వేషన్లు సాధించేదాకా పోరాటం ఆగదు..* * -బీసీ జేఏసీ,అఖిలపక్ష కమిటీ, ప్రజా,విద్యార్థి & ఉద్యోగ సంఘాల నాయకులు.. * విద్య ,ఉపాధి, రాజకీయాల్లో, బీసీలకు 42శాతం రిజర్వేషన్లు సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుతంజోగులాంబ గద్వాల, కేటి దొడ్డి :..

నేటి సాక్షి ఈ సందర్భంగా “*గాజుల కృష్ణ రెడ్డి,* మాట్లాడుతూ, బీసీలందరూ తమ శక్తిని చాటే సమయం వచ్చిందని,”బీసీ చైతన్య సదస్సు”గద్వాల వాల్మీకి భవన్లో 9-11-2025 ఆదివారం మన బిసి బిడ్డలు అంతా తరలి వెళ్లి ఐక్యతను చాటి ఢిల్లీ వరకు రిజర్వేషన్ల నినాదాన్ని బలంగా వినిపించాలని పిలుపునిచ్చారు. 42శాతం రిజర్వేషన్ల సాధన కోసం రాజకీయ ఒత్తిడి పెంచాల్సిన ప్రాముఖ్యతను కృష్ణ గారు ఉద్ఘాటించారు. బిసిల హక్కులను కాలరాసేందుకు, ఎన్నికల టిక్కెట్లు లేదా చిన్న ప్రయోజనాల పేరిట ఐక్యతను విచ్ఛిన్నం చేయాలని కొందరు ప్రయతినిస్తున్నారని విమర్శించారు. ఇది ప్రభుత్వాలపై ఉద్యమం కాదని, బహుజనుల జీవన మనుగడ కోసం ఆరాటమని స్పష్టం చేశారు.జోగులాంబ గద్వాల జిల్లాలో ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో భాగంగా కేటి దొడ్డి మండలాల్లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అని తెలిపారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమం లో బహుజన, Bc నాయకులు నాగర్ దొడ్డి వెంకట రాములు, మధుసూదనుబాబు, కే ప్రభాకర్ సార్, ఎం వాల్మీకి ,కే వినోద్ కుమార్, ఉత్తనూరు వెంకన్న, కృష్ణయ్య, యునెస్ ,కిరణ్ నాగిరెడ్డి, శివ కేటుదొడ్డి మండలం నాయకులు పాల్గొన్నారు.ఎర్ర భీమిరెడ్డి, ముంగిలి వీరేశ్ రెడ్డి, మంగలి నరసింహులు, శివ గంగానపల్లి, నాగిరెడ్డి నందిని, దరెప్పల సూరి, ఆంజనేయులు, తాయప్ప, వీరేష్, టీచర్ గోవిందు, తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News