నేటి సాక్షి,నారాయణపేట, నవంబర్ 3,తెలంగాణ రాష్ట్రంలో 50% పైబడి ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ప్రత్యేక చట్టం ద్వారా అమలు చేసి 9వ షెడ్యూల్లో చేర్చి రక్షణ కల్పించకపోతే తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను అడ్డుకుంటామని మరికల్ మండల బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు కస్తుల ఆంజనేయులు ముదిరాజు గారు డిమాండ్ చేశారు, కాంగ్రెస్,బిజెపి, బిఆర్ఎస్ అగ్రవర్ణ పార్టీలు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు బీసీలకు స్థానిక ఎన్నికలలో 42% రిజర్వేషన్లతో పాటు విద్యలోనూ ఉపాధిలోను 42 శాతం రిజర్వేషన్లకు చట్టం చేసి ఆ చట్ట రక్షణకై 9వ షెడ్యూల్లో చేర్చాలని బీసీ ఎస్సీ ఎస్టీ – జేఏసీ మరియు ధర్మ సమాజ్ పార్టీ సంయుక్తంగా ఆధ్వర్యంలో మరికల్ మండల అధికారి గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ జిల్లా కో కన్వీనర్ నరేష్ ముదిరాజు ,బిసి ఐక్యవేదిక నాయకులు సీతారాం ముదిరాజు , దుంప రాజు ముదిరాజు జిల్లా నాయకులు మరియు ధర్మ సమాజ్ పార్టీ జిల్లా నాయకులు పొర్ల డేవిడ్ , మల్లికార్జున్ మహారాజ్ గారు మరియు ధన్వాడ మండల ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు నరేష్, ఊట్కూరు మండల ధర్మ సమాజ్ పార్టీ నాయకులు వేణు, ఊట్కూరు మండల జేఏసీ నాయకులు, అంజి, కనకం శ్రీనివాసులు, బాలరాజ్,నరేష్, గణేష్ మహారాజ్ అంజి, కొండాపురం రాజు మహారాజ్ తదితరులు పాల్గొన్నారు.

