కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు సమతా ప్రకాష్
నేటి సాక్షి ప్రతినిధి,మహేశ్వరం(చిక్కిరి.శ్రీకాంత్)
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు మాట్లాడుతూ…రాహుల్ గాంధీ భారత్ చోడో యాత్ర మొదలుపెట్టి భారత్ జూడో యాత్రలో బీసీలకు 42% ఇస్తామని మాట ఇవ్వడం జరిగింది అలాగే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో అమలు చేయడం హర్షం వ్యక్తం.. భావిస్తూ మహేశ్వరం నియోజకవర్గంలో.. మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో.. పెద్ద ఎత్తున.. ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం..బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ చారిత్రాత్మక నిర్ణయం సమత ప్రకాష్ అన్నారు.కాంగ్రేస్ పార్టీకి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంది కాబట్టే రిజర్వేషన్లు కల్పించి వారికి సముచిత స్థానం కల్పించిందన్నారు.
దేశ చరిత్రలో 42 శాతం రిజర్వేషన్లు బీసీ లకు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు.
సామాజిక విప్లవానికి నాంది పలికి చారిత్రాత్మక ఆవిష్కరణ సందర్భంగా బీసీ రిజర్వేషన్ల పట్ల మాకు కితాబు ఇవ్వకపోయినా పరవాలేదు.. కానీ కనీసం హర్షించే (స్పందించే) స్థితిలో
బిఆర్ఎస్, బిజెపి పార్టీలు లేకపోవడం మన దౌర్భాగ్యం అన్నారు.ఎవరు దొంగలు అనేవిషయం తెలంగాణ ప్రజలకు స్పష్టంగా తెలుసన్నారు.కేంద్రంలోని బిజెపికి అన్ని బిల్లులకు వాళ్ల హయంలో బిఆర్ఎస్ మద్దతు ప్రకటించిందన్నారు.