Tuesday, March 10, 2026

నేటి సాక్షి – మెట్ పల్లి(దామ రాజేష్)మల్లాపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన MPL-4 క్రికెట్ లీగ్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా జరిగిన బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా ఫైనల్ మ్యాచ్‌లో పోటీపడి విజయం సాధించిన విన్నర్ టీమ్, అలాగే ప్రతిభ కనబరిచి ద్వితీయ స్థానంలో నిలిచిన రన్నర్-అప్ టీమ్‌లకు ఎమ్మెల్యే సంజయ్ బహుమతులు అందజేశారు. క్రీడాకారులను ఉత్సాహపరిచేలా విన్నర్ మరియు రన్నర్-అప్ టీమ్‌లకు ప్రైజ్ మనీని స్వయంగా స్పాన్సర్ చేసి క్రీడాప్రోత్సాహానికి తన వంతు సహకారం అందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ, గ్రామీణ స్థాయిలో ఇలాంటి క్రీడా పోటీలు యువతలో క్రీడాస్ఫూర్తిని, ఐక్యతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. క్రీడల ద్వారా శారీరక ఆరోగ్యం, క్రమశిక్షణతో పాటు నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని పేర్కొంటూ, యువత చదువుతో పాటు క్రీడల్లోనూ ముందుకు రావాలని ప్రోత్సహించారు.కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, క్రీడాభిమానులు, యువకులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News