నేటి సాక్షి,నారాయణపేట, డిసెంబర్ 27, నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలోని 449 భూ బాధితుల ఆధ్వర్యంలో శనివారం నాడు నూతనంగా ఎన్నికైన మరికల్ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు, అదేవిధంగా సిపిఎం జిల్లా నాయకులు వెంకట్రామారెడ్డి, బలరాములకు, నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు సూర్య మోహన్ రెడ్డికి అదేవిధంగా మరికల్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులకు 449 బాధితుల ఆధ్వర్యంలో శాలువలతో పూలమాలలతో ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురు మాట్లాడుతూ 449 బాధితులకు త్వరలోనే భూపాస్ పుస్తకాలు అందిలా చూస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు 449 బాధితులు తదితరులు పాల్గొన్నారు.

