*ప్రణాళిక ప్రకారం రోడ్డు భద్రతా చర్యలు అమలు* చేయాలి**అదనపు కలెక్టర్ గడ్డం నగేష్**రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశం**హాజరైన అదనపు ఎస్పీ చంద్రయ్య, వివిధ శాఖల అధికారులు**సిరిసిల శివకుమార్* ప్రణాళిక ప్రకారం రోడ్డు భద్రతా చర్యలు అమలు చేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు. రోడ్డు సేఫ్టీ కమిటీ సమావేశాన్ని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో బుధవారం ఆర్ అండ్ బీ, నేషనల్ హైవేస్, పీ ఆర్, పోలీస్, ట్రాన్స్ పోర్ట్, వైద్య, ఎక్సైజ్, విద్య, ఆర్టీసీ తదితర శాఖల అధికారులతో రోడ్డు సేఫ్టీ కమిటీ సమీక్ష సమావేశం అదనపు కలెక్టర్ నిర్వహించారు. ముందుగా గతనెలలో నిర్వహించిన రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశం సందర్భంగా చర్చించిన అంశాలపై సమీక్ష చేశారు. రవాణా, ఆర్ అండ్ బీ, నేషనల్ హైవేస్, పోలీస్ శాఖ సంయుక్తంగా చేసిన సర్వే వివరాలపై ఆరా తీశారు.వివిధ ప్రధాన రహదారుల్లో గుర్తించిన బ్లాక్ స్పాట్స్ వద్ద రంబుల్ స్ట్రిప్స్, సోలార్ సిగ్నల్స్, సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలని, రోడ్డు పైకి అడ్డుగా వచ్చిన చెట్ల కొమ్మలను తొలగించాలని సూచించారు. పలు జంక్షన్లు, రహదారుల్లో స్పీడ్ గన్స్, సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని, ఇప్పటికే ఉన్న వాటిని మరోసారి పరిశీలించాలని ఆదేశించారు.జిల్లాలోని అన్ని పెట్రోల్ బంక్ లలో కచ్చితంగా *నో హెల్మెట్ .. నో పెట్రోల్* అమలు చేయాలని సూచించారు. పరిమితికి మించి విద్యార్థులను, ప్రయాణీకులను తరలిస్తున్న ఆటోలు, బస్సులను తనిఖీ చేయాలని, ఓవర్ లోడ్ తో వెళ్ళే సరుకు వాహనాలపై దృష్టి సారించాలని రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఆర్టీఏ సభ్యుడు సంగీతం శ్రీనాథ్, ఈఈ ఆర్ అండ్ బీ నరసింహాచారి, ఈఈ నేషనల్ హై వేస్ సురేష్ రాథోడ్, డీటీఓ లక్ష్మణ్, ఈఈ పీఆర్ సుదర్శన్ రెడ్డి, నేషనల్ హైవే డీఈ అన్నయ్య, ఆర్ అండ్ బీ డీఈ శాంతయ్య, డీఈఓ జగన్ మోహన్ రెడ్డి, ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్ రావు, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, సంపత్ కుమార్, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.





