Saturday, March 7, 2026

మరికల్ మండల పరిషత్ కార్యాలయంలో చెత్తాచెదారం…..- పట్టించుకోని అధికారులు…..(అక్షర కలం, నారాయణపేట జిల్లా రిపోర్టర్, మార్చ్, 07)నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో చెత్తాచెదారాలు పేరుకుపోయిన కార్యాలయం సిబ్బంది పట్టించుకోవడంలేదని కార్యాలయానికి వచ్చే వివిధ గ్రామాల ప్రజలు మండల లోని వివిధ గ్రామాలలో చర్చించుకుంటున్నారు. గతంలో గ్రామంలో ఉన్న పాత కార్యాలయం శుభ్రంగా ఉండేదని ప్రస్తుత పరిస్థితి దానికి భిన్నంగా ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు. కార్యాలయంలోకి వెళ్లగానే కాగితాలు, ఇల్లారా, చెత్త ,కనిపిస్తాయి తప్ప శుభ్రపరిచే నాధుడే లేడని వచ్చిన జనాలు చర్చించుకుంటున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి శుభ్రత కార్యక్రమాలు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు అధికారులను కోరుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News