*ప్రకృతి గర్భగుడి*——————-మన హృదయం ప్రకృతి గర్భగుడిగా మారిన వేళ,వర్షపు చినుకులు అభిషేకాలై జలజలా కురిశాయి.గాలుల సున్నిత నాదం మంత్రోచ్ఛారణగా వినిపించగా,పక్షుల గానధారలు ఘంటానాదాలై మార్మోగాయి.భూమి ఒడిలో మొలిచిన ప్రతి పచ్చ మొగ్గదైవసాన్నిధ్యపు మౌన ప్రతిమగా నిలిచింది.సూర్యకిరణాలు హారతులై వెలుగులు చిందించగా,చంద్రకాంతి కరుణా ప్రసాదంలా జాలువారింది.కానీ —మనిషి మనసులో మొలిచిన స్వార్థపు ముళ్లుఆ ప్రకృతి గర్భగుడిని గాయపరిచాయి.అసూయ అనే అగ్నికణం ఎగసి పడిన వేళహృదయ పవిత్రత బూడిదగా మారింది.అహంకారం అనే అంధకారం కమ్ముకున్నప్పుడుఆత్మదీపం మసకబారింది.ద్వేషం అనే విషగాలి వీచిన క్షణంలోజీవన వనమే వాడిపోయింది.అడవులను నరికిన కత్తుల ధ్వనిమనిషి ఊపిరినే మూలం నుంచి కోసేసింది.పక్షుల గానాలు నిశ్శబ్దంలో కలిసిపోతూప్రకృతి ఆలయం శూన్యంగా మారింది.మన హృదయం మళ్లీ పవిత్రమైతేనేప్రకృతి గర్భగుడి తిరిగి వెలుగుతుంది.మన ప్రేమే హారతి, మన కరుణే పూజగా మారితేఈ భూమి మళ్లీ దైవాలయంగా వికసిస్తుంది.ప్రకృతిని కాపాడుదాం…— శ్రీమతి మంజుల పత్తిపాటికవయిత్రిమాజీ డైరెక్టర్, ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీయాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ రాష్ట్రంచరవాణి: 9347042218________





