నవోదయలో సీటు సాధించిన కళ్యాణి స్కూల్ విద్యార్థి నక్క గౌరీనాథ్బుగ్గారం : బుగ్గారం మండల కేంద్రంలోని కళ్యాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మెరిసిన విద్యా కుసుమం బుగ్గారం మండల కేంద్రానికి చెందిన నక్క గౌరీనాథ్ S/O శంకర్ ఇటీవలే వెలువరచిన నవోదయ ఫలితాలలో అత్యుత్తమ ర్యాంకు సాధించి పలువురు ప్రశంసలను అందుకున్నారు.వివరాల్లోకెళ్తే బుగ్గారం మండల కేంద్రంలో స్థానిక కళ్యాణి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థి నక్క గౌరినాథ్ నవోదయ కాంపిటీటివ్ ఎగ్జామ్ లో అత్యుత్తమ మార్కులు సాధించి ర్యాంకు సాధించాడు దీనితో విద్యార్థిని నక్క గౌరీనాథ్ ను కరస్పాండెంట్ అబ్దుల్ రహమాన్ సన్మానించి అభినందించారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని తల్లిదండ్రులు నక్క శంకర్ లేహ ప్రిన్సిపాల్ పంజాల తిరుపతి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు అభినందించారు.





