Sunday, April 19, 2026

నేటి సాక్షి.సిరిసిల్ల రిపోర్టర్ శివకుమార్:-105 కోట్ల విలువ గల ఆర్ వి ఎం వస్త్రాలను ఆర్డర్స్ అకస్మాత్తుగారద్దుచేసి కార్మికుల ఉపాధి దెబ్బతీయడం ప్రభుత్వం దుర్మార్గమైన చర్య చేనేత పవర్లూమ్ పరిశ్రమపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి వెంటనే ప్రభుత్వ వస్త్రాలఆర్డర్స్ కమిషన్ల కోసం టెండర్ వేయకుండా కార్మికులకు 365 రోజులు ఉపాధి కల్పించాలి ము శం రమేష్ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడుఈరోజు సిఐటియు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పవర్లు వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ2026 _ 27 విద్యా సంవత్సరానికిసంబంధించి టెస్కో కు ఇచ్చిన ఏకరూప దుస్తుల ఆర్డర్ అకస్మాత్తుగా రద్దు చేస్తూ చేనేత శాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం వలన చేనేత పవర్లూమ్ కార్మికుల జీవనోపాది మీద పెద్ద ఎత్తున ప్రభావం పడుతుందివిద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి ఆధీనం లో ఉన్నది ముఖ్యమంత్రి ఆధీనంలో ఉన్నాయి కూడా కమిషన్ల కోసంటెండర్ ద్వారా ఈ ఆర్డర్స్ ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడం అనేది ఒక దుర్మార్గపు చర్య సిరిసిల్లలో ఆర్ వి ఎం క్లాత్ ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చింది వస్త్రాలు తయారు చేయడానికి 50 కోట్ల విలువగల నూలు ఖరీదు చేసి వస్తాను ఉత్పత్తి ప్రారంభిస్తున్న సందర్భంగా అకస్మాత్తుగా చేనేత జోలి శాఖ ఆర్డర్లను రద్దు చేస్తున్నాము ఉత్పత్తి చేయద్దు అని ఆదేశాలు జారీ చేస్తే నూలుకున్న నేతన్నల పరిస్థితి ఏం కావాలి ఇప్పటికే రాష్ట్రం లో పవర్లూమ్ చేనేత కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నదిఇప్పటికే యుద్ధ పరిస్థితిల వల్ల అన్ని ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి వస్త్ర పరిశ్రమ నెట్ట వేయబడుతుంది మరి ఇలాంటి దుస్థితికి కారకులు ఎవరు ?మాది ప్రజా ప్రభుత్వం అని ప్రజల సంక్షేమం మా ప్రధాన అజండా అని చెప్పుకునే మీరు చేసే విధానంఇదేనా అని అన్నారు పవర్ లుచేనేత కార్మికులకు 365 రోజులు పని కల్పించాల్సిన బాధ్యతను ముఖ్యమంత్రి విస్మరిస్తున్నారుఅన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు అవసరమయ్యే వస్త్రాలను చేనేత పవర్లూమ్ కార్మికుల ద్వారానే ఉత్పత్తి చేయించాలిటెండర్ విధానం వెంటనే రద్దు చేసిటెస్కో కు విద్యా శాఖ నుండి ఏకరూప దుస్తుల ఆర్డర్స్ ను పునరుద్దరిస్తు జి ఓ జారీ చేయాలి ప్రభుత్వానికి డిమాండ్ చేశారు లేనిపక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు నిర్వహిస్తామని అన్నారు ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు కోడం రమణ జిల్లా నాయకులు సిరిమల సత్యం ఒగ్గు గణేష్ నక్క దేవదాస్ సందుపట్ల సత్యం తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News