నేటి సాక్షి, బెజ్జంకి: బెజ్జంకి మండల కేంద్రంలోని బెజ్జంకి క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 47వ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యే క్రికెట్ టోర్నమెంట్ బహుమతి ప్రధానోత్సవంలో భాగంగా సోమవారం సాయంత్రం మానకొండూర్ శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొని బహుమతులను అందజేశారు. ఈ టోర్నమెంట్‌లో సిరిసిల్ల నియోజకవర్గం ఎదురుగట్ల టీమ్ మొదటి బహుమతిని గెలుచుకోగా, బెజ్జంకి నవయువ యూత్ రెండవ బహుమతిని సాధించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడల ద్వారా యువత శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరచుకోవచ్చని, పోటీ తత్వంతో ఆడినప్పుడే క్రీడల్లో విజయాలను సొంతం చేసుకోవచ్చని ఎమ్మెల్యే అన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్, మండల అధ్యక్షులు ముక్కిస రత్నాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ చిలువేరు శ్రీనివాస్ రెడ్డి, ఎఎంసీ డైరెక్టర్లు పులి సంతోష్, బండిపెల్లి రాజు, మచ్చ కుమార్,యూత్ అధ్యక్షులు కర్రావుల సందీప్, గుడేల్లి శ్రీకాంత్, రొడ్డా మల్లేశం, కొంకటి రాములు, తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, సోషల్ మీడియా కన్వీనర్ కుంట హరికృష్ణ, క్రికెట్ అసోసియేషన్ నిర్వాహకులు దుమ్మల సురేష్, మహేష్, రాము తదితరులు పాల్గొన్నారు.

