Monday, December 23, 2024

5 నెలల్లోనే ప్రజావిశ్వాసం కోల్పోయింది..

  • – ఇందుకు పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే నిదర్శనం
  • – బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ వెల్లడి
  • – తరుణ్ చుగ్​తో బండి సంజయ్ భేటీ
  • – రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై చర్చ
  • – సంజయ్​కు పలువురు ప్రజాప్రతినిధుల అభినందనలు

నేటి సాక్షి, కరీంనగర్​: అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కేవలం ఐదు నెలల్లోనే విశ్వసనీయతను కోల్పోయిందని, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్ శుక్రవారం తరుణ్ చుగ్​ను తరుణ్ చుగఖను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంజయ్​కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. బండితో అరగంటకుపైగా తరుణ్​చుగ్​ ముచ్చటించారు. కేంద్ర మంత్రిగా ఆ శాఖకు మంచి పేరు తీసుకురావడంతోపాటు ప్రజలకు మరింత మేలు జరిగేలా బండి పని చేస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు. తెలంగాణలో 8 పార్లమెంట్ స్థానాలను గెలిచిన బీజేపీ 35 శాతానికిపైగా ఓట్లు సాధించడంపట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇది నరేంద్రమోదీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలవల్లే ఇది సాధ్యమైందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు ఉన్న నిరాశను ఎన్నికల ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయని, అసెంబ్లీ ఎన్నికల్లో అలవికాని హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేయకుండా తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తోందన్నారు. ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌పట్ల ప్రజల్లో ఉన్న ఆగ్రహానికి అద్దం పడుతున్నాయన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పనైపోయిందని, కాంగ్రెస్ పార్టీకి బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమనే విషయం కూడా పార్లమెంట్ ఫలితాలతో రుజువైందన్నారు.
బండికి అభినందన వెల్లువ
మరోవైపు బండికి సంజయ్​కు పలువురు నేతల నుంచి అభినందనల పరంపర కొనసాగుతూనే ఉంది. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కరీంనగర్​తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి పలువురు నాయకులు, కార్యకర్తలు, అధికారులు సంజయ్​ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సైతం సంజయ్​ను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన 2022 బ్యాచ్ ఐఏఎస్ అధికారులు సైతం సంజయ్​ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్​రెడ్డి, మాజీ ఎంపీలు సీతారాం నాయక్, బీబీ పాటిల్, మాజీ ఎమ్మెల్యేలు సంకినేని వెంకటేశ్వరరావు, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు, బీసీ కమిషన్ మాజీ సభ్యులు టీ ఆచారి, రాష్ట్ర అధికార ప్రతినిధులు ఎన్వీ సుభాష్, వీరేందర్ గౌడ్, జే సంగప్పతో పాటు వివిధ మోర్చాలకు చెందిన నాయకులు సంజయ్​ను కలిసిన వారిలో ఉన్నారు.

బీఎస్కేతో మాజీ ఎంపీలు
బీఎస్కేతో 2022 బ్యాచ్ ఐఏఎస్ లు
బీఎస్కేతో మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ దరహాసం

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News