నేటి సాక్షి, గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్):* గన్నేరువరం మండల పోలీస్ స్టేషన్ పరిధిలో బొలెరో వాహనంలో అక్రమంగా పిడిఎస్ బియ్యం తరలిస్తుంటే సివిల్ సప్లై డిపార్ట్మెంట్ సిబ్బంది దాడులు నిర్వహించి 50 క్వింటాళ్ల బియ్యంతో కూడిన బొలెరో వాహనం ను పట్టుకున్న సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై జి నరేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం బెజ్జరాజు 50 క్వింటాళ్ల రేషన్ బియ్యం ను అక్రమంగా తరలిస్తున్న క్రమంలో పట్టుకున్న సివిల్ సప్లై అధికారి ఏ శ్రీనివాస్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జి నరేందర్ రెడ్డి తెలిపారు.

