- కమిషనర్ ఎన్. మౌర్య
నేటి సాక్షి, తిరుపతి జిల్లా (బాదూరు బాల) : తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కు 52 వినతులు వచ్చాయని కమిషనర్ ఎన్.మౌర్య తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఫోన్ ద్వారా 18 మంది తమ సమస్యలు తెలుపగా, 34 మంది నేరుగా వచ్చి వినతులు సమర్పించారు. డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, ఆర్.సి. మునికృష్ణ పాల్గొనగా కార్పొరేటర్ నరసింహ ఆచారి సమస్యలు పరిష్కరించాలని కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రిజర్వాయర్ రోడ్డులో అన్నదమ్ములం బాగా పరిష్కారం చేసుకున్నామని, మాకు సర్వే చేస్తే పన్ను బకాయిలు చెల్లిస్తామని, నేను డయాలసిస్ పేషెంట్ అని నేను వెలి ముద్ర వేస్తే శిరీష అనే పేరు వస్తుంది పరిష్కరించాలని, బి.సి. రుణానికి దరఖాస్తు చేసుకున్నారని తిరుపతి టౌన్ బదులు చిత్తూరు అని సరిచేయాలని, నగరపాలక సంస్థ ఔట్ సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న నా భర్త మృతించాడని, తన కుమారుడికి ఉద్యోగం ఇవ్వాలని, టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, టిటిడి పరిపాలనా భవనం పక్కన వేసిన రోడ్డును పూర్తిగా ఏర్పాటు చేయాలని, దేవాలయం పక్కన అక్రమంగా పైప్ లైన్ పగలగొట్టి పిల్లర్లు వేస్తున్నారని పరిశీలించాలని, ప్రకాశం పార్కు వాకింగ్ టాక్ గుంతలు సరి చేయాలని, జిమ్.పరికరాలు మరమ్మత్తులు చేయాలని, మొక్కలు విరివిగా నాటాలని, జ్యోతి థియేటర్ బస్టాప్ వద్ద మురుగు కాలువ సరి చేయాలని, చెన్నారెడ్డి కాలని ప్రభుత్వ స్కూల్ వద్దు చెత్త వేయకుండా చూడాలని కోరరాని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్ తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, డిసిపి మహాపాత్ర, డి.ఈ.లు, ఏసిపి లు, తదితరులు ఉన్నారు.

