Wednesday, July 23, 2025

6న కురుమూర్తి స్వామి దేవస్థానంలో లక్ష పుష్పార్చన పూజ..

-రెండు రోజులపాటు పూజలు

నేటి సాక్షి,దేవరకద్ర జులై 1

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం పరిధిలోని చిన్నచింతకుంట మండలం శ్రీ శ్రీ శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానంలో ఈనెల 6,7 తేదీలలో లక్ష పుష్పార్చన పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఈవో మదనేశ్వర్ రెడ్డి, చైర్మన్ గౌని గోవర్ధన్ రెడ్డిలు ఓ ప్రకటనలో తెలిపారు. ఆషాడ శుద్ధ శయనేకాదశి (తొలి ఏకాదశి) పర్వదిన వేడుకలను పురస్కరించుకొని దేవస్థానంలో ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా ఈనెల 6న ఉదయం 6 గంటలకు సుప్రభాత సేవ, 6:30 కు స్వామివారికి, అమ్మవారికి పంచామృతాభిషేకం, 9 గంటలకు విశ్వక్ సేవ, పుణ్య వాచనం, 10 గంటలకు కురుమూర్తి స్వామి వారికి లక్ష పుష్పార్చన,7 గంటలకు అమ్మవారికి కుంకుమార్చన,8 గంటలకు ప్రదోషకాలం పూజ,

9 గంటలకు తీర్థ ప్రసాద వితరణ, 10 గంటలకు అఖండ భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. అలాగే ఈనెల 7న ఉదయం 7 గంటలకు శ్రీ స్వామివారికి సహస్రనామార్చన, 9 గంటలకు మహా నివేదన, 9:30 గంటలకు తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. స్వామివారికి జరుగు సహస్ర పుష్పార్చన జరిపించ తలచిన భక్తులు రూ.151 రుసుము చెల్లించి వారి గోత్రం పేరు దేవస్థానంలో నమోదు చేయించుకోవాలని వారు కోరారు. ఈ పవిత్ర పూజా కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి వారి కృప కృపకు పాత్రులు కావాలని వారు కోరారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News