ఇదే నిజం, ఆసిఫాబాద్ టౌన్: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 66మంది కల్యాణలక్ష్మీ లబ్ధిదారులకు ఎమ్మెల్యే కోవ లక్ష్మీ చెక్కులను బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పేదింటి ఆడబిడ్డలకు ఇంటికి పెద్ద దిక్కుగా ఆలోచించి కల్యాణలక్ష్మీ పథకం ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఈ పథకం లక్షలాది పేద కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచిందని చెప్పారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసి, గద్దెను ఎక్కిందని విమర్శించారు. కల్యాణలక్ష్మీతో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీ ఎక్కడికిపోయిందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆమె ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అరిగేల నాగేశ్వర్ రావు, ఎంపీపీ మల్లికార్జున్, సింగిల్ విండో చైర్మన్ అలీ, వాంకిడి జడ్పీటీసీ అజయ్‌కుమార్, సింగిల్ విండో చైర్మన్ పెంటూ, ఇతర ప్రజాప్రతినిధులు , అధికారులు తదితరులు పాల్గొన్నారు.