నేటి సాక్షి,నారాయణపేట డిసెంబర్ 6,నారాయణపేట జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో 63వ హోం గార్డుల (ఆవిర్భావ దినోత్సవం) రైజింగ్ డే ను శనివారం రోజు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పరేడ్ అనంతరం కాన్ఫరెన్స్ హాల్లో హోం గార్డులతో ఇంటరాక్ట్ అయిన జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్* వారి సమస్యలను వివరంగా తెలుసుకుని త్వరితగతిన పరిష్కరించే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…ప్రజా భద్రత, విపత్తు నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల నిర్వహణ వంటి కీలక రంగాల్లో హోం గార్డులు పోలీస్ శాఖలో అంతర్భాగంగా కలిపి పనిచేస్తూ, నిష్ట, నిబద్ధతతో అద్భుత సేవలు అందిస్తున్నారని అన్నారు. నేరాల నివారణలో, కమ్యూనిటీ పోలీసింగ్‌లో, అత్యవసర సేవల్లో హోం గార్డుల పాత్ర అపారమైందన్నారు.హోం గార్డుల సంక్షేమంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు.రోజువారీ వేతనం ₹921 నుండి ₹1000 కు ప్రభుత్వం పెంచిందని, హోం గార్డు విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణిస్తే యాక్సిస్, హెచ్డీఫ్సీ బ్యాంకుల ద్వారా ₹30 లక్షల బీమా ఇవ్వడం జరుగుతుందని, ఔట్ పేషెంట్ చికిత్సకు ₹10,000 సహాయం, సహజ మరణం / ప్రమాద మరణాలకుయాక్సిస్ బ్యాంక్ ద్వారా 5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తుందని తెలిపారు.రాబోయే రోజుల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు పరిశీలనలో ఉందని, కొత్త హోం గార్డ్ పోస్టులు రిక్రూట్మెంట్ పరిశీలనలో ఉంది అని తెలిపారు.ఎస్పీ వినీత్ మాట్లాడుతూ…హోంగార్డ్ వ్యవస్థ పోలీస్ శాఖలు అంతర్భాగంగా పనిచేస్తుందని వారి అసాధారణ కర్తవ్యనిర్వహణ చేసే ప్రతి ఒక్క హోం గార్డు అధికారికి నా ప్రత్యేక సెల్యూట్. మీ సేవలకు పోలీస్ శాఖ తరఫున పూర్తి మద్దతు ఎప్పుడూ ఉంటుంది బాగా పని చేసిన హోంగార్డులకు ప్రశంస పత్రాలు ఇవ్వడం జరిగిందని, పోలీసులతో పాటు నన్ను సౌకర్యాలు కల్పించడంతోపాటు విధి నిర్వహణలో క్రమశిక్షణ, సమయపాలన, బాధ్యతతో పనిచేయాలని తెలిపారు.హోం గార్డుల ఆరోగ్యం, ఫిట్నెస్, టీమ్ స్పిరిట్ పెంపునకుగాను వాలీబాల్, కబడ్డీ, 100 మీటర్ల రన్ వంటి క్రీడా పోటీలు నిర్వహించామని, క్రీడలలో గెలుపొందిన వారికి, పోలీసు శాఖలో బాగా పని చేసిన హోం గార్డులకు ఎస్పీ మెమెంటోలు, ప్రశంసాపత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ హుల్ హక్,డీఎస్పీ నల్లపు లింగయ్య,హోం గార్డ్స్ ఇన్చార్జ్ మద్దయ్య, శ్వేత, జిల్లాలోని హోం గార్డులు పాల్గొన్నారు.





