నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల)
తిరుపతి మాజీ శాసనసభ్యులు మన్నూరు వెంకటరమణ 78 జయంతి సందర్భంగా శనివారం తిరుపతి తెలుగుదేశం పార్టీ కార్యాలయం సమీపంలో ఉన్న వెంకటరమణ ఘాట్ వద్ద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వెంకటరమణ సతీమణి మాజీ ఎమ్మెల్యే తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి మన్నూరు సుగుణమ్మ కుటుంబ సభ్యలు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సుగుణమ్మ మాట్లాడుతూ మన్నూరు వెంకట రమణ గారి 78 వ జయంతి సంధర్భంగా ఘాట్ వద్ద పూజ కార్యక్రమంతో పాటు రుయా హాస్పిటల్ వద్ధ ఆన్నదాన కార్యక్రమం చేయడం జరిగిందని తెలిపారు ఆయన అహర్నిశలు తిరుపతి అభివృద్ధి కోసం తిరుపతి నియోజకవర్గ ప్రజలకోసం శ్రమించారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో తిరుపతి నియోజకవర్గ పరిధి లో ఉన్న కార్యకర్తలు, నాయకులు, పార్లమెంట్ నాయకులు,రాష్ట్ర నాయకులు, అనుబంధం సంఘాల నాయకులు, మహిళా కమిటీల సభ్యులు, క్లస్టర్ ఇంచార్జ్ లు యూనిట్ ఇంచార్జ్ లు డివిజన్ కమిటీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు, అభిమానులు అందరు భారీ ఎత్తున పాల్గొని జయప్రదం చేశారు.





