- – అట్టహాసంగా ప్రారంభించిన కరీంనగర్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ వెలిచాల రాజేందర్ రావు
- – మూడు రోజుల పాటు పోటీలు.. 800 మంది కబడ్డీ క్రీడాకారులు హాజరు
నేటి సాక్షి, కరీంనగర్: కరీంనగర్ లోని వివేకానంద సీబీఎస్సీ హైస్కూల్లో ఏపీ, తెలంగాణ 7వ క్లస్టర్ కబడ్డీ పోటీలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ వెలిచాల రాజేందర్ రావు హాజరై, సీబీఎస్ఈ క్లస్టర్ కబడ్డీ టోర్నమెంట్ పతకాన్ని ఆవిష్కరించారు. ఈ కబడ్డీ టోర్నమెంటు మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి. 800 మంది కబడ్డీ క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా వెలిచాల రాజేందర్ రావు మాట్లాడుతూ కబడ్డీ అంటేనే కరీంనగర్ జిల్లా కేరాఫ్ గా తీర్చిదిద్దుతామని, ఇందుకోసం కబడ్డీ క్రీడాకారులకు శిక్షణతోపాటు అన్ని వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే కరీంనగర్ జిల్లా కబడ్డీ క్రీడాకారులకు నిలయంగా మారుస్తామని, ఇందుకు ప్రభుత్వం, స్పోర్ట్స్ అథారిటీ సహాయం తీసుకుంటామని తెలిపారు. క్రికెట్ తర్వాత అత్యంత క్రేజ్ ఉన్న క్రీడ కబడ్డీ అని, క్రీడాకారులు కబడ్డీపై ఆసక్తి కనబరచాలని సూచించారు. ఈ క్లస్టర్ కబడ్డీ టోర్నమెంట్లో విజేతలుగా నిలిచిన జట్లకు తాను స్వయంగా నగదు బహుమతి అందిస్తానని రాజేందర్రావు ప్రకటించగా, జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు చెన్నాడి అమిత్ కుమార్, రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు సీహెచ్ సంపత్ రావు, జిల్లా కార్యదర్శి మల్లేశం గౌడ్, రెఫరీ బోర్డు చైర్మన్ లక్ష్మీనారాయణ, సీబీఎస్ఈ అబ్జర్వర్ లెంక వెంకటరమణ, వివేకానంద సీబీఎస్ఈ హైస్కూల్ చైర్మన్ పోల్సాని సుధాకర్, డైరెక్టర్ లలిత కుమారి, ప్రిన్సిపాల్ రేణుక, వైస్ ప్రిన్సిపాల్ ప్రశాంత్, హెచ్ఎం అనిత, అడ్మిన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ చిత్తరంజన్, అడ్వైజరీ మెంబర్ గండ్ర లక్ష్మణరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ టీ సత్యనారాయణ, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

