నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )సమాజ సేవలో ఆదర్శంగా నిలుస్తున్న మహ్మద్ బాబు జాన్ మరోసారి తన సేవా మనసును చాటుకున్నారు. అత్యవసర పరిస్థితిలో తక్కళ్లపెల్లి గ్రామానికి చెందిన దస్తగిరి అనే వ్యక్తికి చికిత్స నిమిత్తం సిద్ధిపేట జిల్లా ములుగు పట్టణంలోని ఆర్వీఎం (RVM) ఆసుపత్రిలో అవసరమైన B+ ఆర్‌డీపీ ప్లేట్‌లెట్స్‌ను దానం చేసి ప్రాణదాతగా నిలిచారు. తీవ్ర పరిస్థితుల్లో ఉన్న వ్యక్తికి సమయానికి ప్లేట్‌లెట్స్ అందడంతో వైద్యులు చికిత్స కొనసాగించగలిగారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.*98వ రక్తదానంతో మైలురాయి*ఈ రక్తదానంతో మహ్మద్ బాబు జాన్ మొత్తం 98 సార్లు రక్తదానం చేసిన ఘనతను సాధించారు. సాధారణ రక్తదానంతో పాటు అవసరమైనప్పుడు ప్లేట్‌లెట్స్ డొనేషన్ కూడా చేస్తూ ఎన్నో కుటుంబాల్లో ఆనందం నింపుతున్నారు. రక్తం కొరత ఉన్న వేళల్లో స్వచ్ఛందంగా ముందుకొచ్చి సేవలందించడం ద్వారా యువతకు, సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని పలువురు ప్రశంసించారు.*పుట్టినరోజు జరుపుకునే రక్తదాతలకు అంకితం*డిసెంబర్ నెలలో పుట్టినరోజు జరుపుకుంటున్న రక్తదాతలు, సామాజిక సేవకులకు ఈ 98వ రక్తదానాన్ని మహ్మద్ బాబు జాన్ అంకితం చేశారు. రక్తదానం చేయడం ద్వారా మనం మరొకరి జీవితానికి వెలుగు నింపగలమని, ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా రక్తదానం చేయాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.——

