- మండలం సిపిఐ నాయకులు డిమాండ్* నేటి సాక్షి, గన్నేరువరం :
గన్నేరువరం.మండల కేంద్రము లో జరిగే వారసంత అన్ని రకాల వసతులు కల్పించాలని సోమవారం సీపీఐ నాయకులు డిమాండ్ చేస్తూ ఎంపీడీవో తీగల శంకర్ కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్బంగా ఆపార్టీ మండల కార్యదర్శి కాంతాల అంజిరెడ్డి మాట్లాడుతూ ప్రతి మంగళవారం జరిగే వారసంత లో కనీసం వసతులు మరుగుదొడ్లు , మూత్రశాలల లేవని దీనివలన మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వాటర్ ప్లాంట్ చాలా రోజులు గా మూత పడి ఉన్నందునా తాగు నీటికి చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వార సంతలో వసతులు కల్పించేంతవరకు గ్రామ పంచాయతీ అధికారులు అన్ని రకాల టెండర్ రద్దు చేయాలని, వసతులు కల్పించిన తర్వాతనే టెండర్ వేయాలి అని డిమాండ్ రు .లేని పక్షం లో సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హేచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆపార్టీ మండల సహాయ కార్యదర్శి చొక్కాల్ల శ్రీశైలం , నాయకులు మొలుగురి ఆంజనేయులు, బోయిని మల్లయ్య కూన మల్లయ్య ,మీసం రాములు, తదితర నాయకులు పాల్గొన్నారు.