నేటి సాక్షి, కరీంనగర్: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లికి చెందిన గుర్రం రాజిరెడ్డిపై రూరల్ ఏసీపీ వెంకటరమణ సస్పెక్ట్ షీట్ తెరిచారు. రాజిరెడ్డి అక్రమంగా భూ ఆక్రమణలకు పాల్పడటం.. పలు కేసుల్లో నిందితుడిగా ఉండటం.. వివిధ నేరాల్లో సైతం చురుకుగా ఉండటంతో అతనిపై సస్పెక్ట్ షీట్ తెరవాలని కొత్తపల్లి ఎస్సై సాంబమూర్తి అభ్యర్థన మేరకు కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్ సిఫారసు చేశారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. రాజిరెడ్డి కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు కదలికలను గమనించాలని కొత్తపల్లి ఎస్సైను రూరల్ ఏసీపీ ఆదేశించారు.