Monday, December 23, 2024

Bandi Sanjay కేసీఆర్ సైబర్ దాడి

  • ఎమర్జెన్సీకంటే దారుణమైన కేసు ఫోన్ ట్యాపింగ్
  • కేసీఆర్ ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు?
  • వడ్ల స్కాంలో ఉత్తమ్, ఫోన్ ట్యాపింగ్ లో రేవంత్ కేసీఆర్ ను కాపాడటం వెనుక మతలబు ఏంది?
  • రేవంత్ కు చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్, కేటీఆర్ ను అరెస్ట్ చేసి ప్రాసిక్యూట్ చేయాలి
  • బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ శ్రీ బండి సంజయ్

నేటి సాక్షి, కరీంనగర్​: ఫోన్ ట్యాపింగ్ తో కేసీఆర్​ ప్రతిపక్షాలపై సైబర్​ దాడి చేశారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ శ్రీ బండి సంజయ్ సోమవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. విషయంలో తాను గతంలో చెప్పిందే నిజమైందని చెప్పారు. కేసీఆర్ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు రాధాకిషన్ రావు పోలీసుల విచారణలో వెల్లడించడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్ మెంట్ ను పరిశీలిస్తే ప్రతిపక్షాలపై ముఖ్యంగా బీజేపీపై దాడి కోసమే ఫోన్ ట్యాపింగ్ ను ఉపయోగించుకున్నట్లు అర్ధమవుతోందని పేర్కొన్నారు. బీజేపీ సానుభూతిపరులతోపాటు పార్టీకి విరాళాలు ఇచ్చేవాళ్లను, మీడియా ప్రతినిధులను సైతం ఫోన్ ట్యాపింగ్ తో టార్గెట్ చేశారంటే కేసీఆర్ కు బీజేపీ అంటే ఎంతగా వణుకు పుడుతుందో తెలుస్తోందని చెప్పారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కేసీఆర్ అదే రాజ్యాంగ మౌలిక సూత్రాలను ఉల్లంఘిస్తూ ప్రజా సమస్యలపై పోరాడుతున్న బీజేపీసహా ప్రతిపక్ష పార్టీల నేతలను భయపెట్టేందుకు ఫోన్ ట్యాపింగ్ చేయడం ముమ్మాటికీ రాజ్యాంగ ద్రోహమేనని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలుగా తమకున్న ప్రత్యేకమైన హక్కులను కాపాడటం దేవుడెరుగు, దేశ పౌరుడికి ఉండే కనీస ప్రాథమిక హక్కులను కూడా ఫోన్ ట్యాపింగ్ తో కాలరాసిన నీచుడు కేసీఆర్ అని మండిపడ్డారు. ఇట్లాంటి దుర్మార్గులు ఎమ్మెల్యేగానే కాదు.. భవిష్యత్తులో రాజ్యాంగబద్దంగా ఏ పదవి చేపట్టడానికి కూడా అర్హులు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ పాపంలో భాగం పంచుకున్నందున బీఆర్ఎస్ పార్టీ గుర్తింపును సైతం రద్దు చేసే అంశంపై ఆలోచించాలని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ పాత్ర ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. తక్షణమే కేసీఆర్ ను అరెస్ట్ చేసి ప్రాసిక్యూషన్ చేయాలని డిమాండ్​ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ప్రజాస్వామ్యంపై ఏ మాత్రం నమ్మకం ఉన్నా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుని తక్షణమే సీబీఐకి లేఖ రాయాలని సూచించారు. సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్​ చేశారు. అలాగే, ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ ను అనర్హుడిగా ప్రకటించే అంశంపైనా శాసనసభ స్పీకర్ తగిన చర్యలు తీసుకోవాలని బీజేపీ పక్షాన కోరారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News