Monday, December 23, 2024

బీటీ పత్తి విత్తనాల పట్టివేత

  • 5.5 క్వింటాళ్ల విత్తనాలు స్వాధీనం
  • ఇద్దరిన అరెస్టు చేసిన రామగుండం పోలీసులు

నేటి సాక్షి, రామగుండం: నిషేధిత బీటీ–3 నకిలీ పత్తి విత్తనాలను రామగుండం సీపీ టాస్క్​ఫోర్స్​ పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం రామగుండం కమిషనరేట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామగుండం పోలీస్‌ కమిషనర్‌ ఎం.శ్రీనివాస్‌ వివరాలు వెల్లడించారు. పక్కా సమాచారం మేరకు మంచిర్యాల జోన్​లోని చెన్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల బతుకమ్మ వాగు వద్ద సీపీ టాస్క్​ఫోర్స్​ ఇన్​స్పెక్టర్​ సంజయ్ , ఎస్సై లచ్చన్న, సిబ్బంది వాహనాలు తనిఖీ చేయగా, ఐచర్​ వ్యాన్ (టీఎస్​ 19 టీ 3447) పట్టుబడింది. వ్యాన్​లో ఉల్లిగడ్డ బస్తాలు వేసుకొని, కింద సుమారు 16.50 లక్షల విలువైన 5.5 క్వింటాళ్ల ప్రభుత్వ నిషేధిత బీటీ-3 నకిలీ విత్తనాలు గుర్తించారు. వ్యాన్​ ఓనర్​ కం డ్రైవర్​ సొల్లు పెద్దయ్య (కొత్తూరు గ్రామం, లక్షెట్టిపేట మండలం), క్లీనర్​ సొల్లు హరికుమార్​ను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి విత్తనాలు, వ్యాన్​, మూడు సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను చెన్నూరు పోలీసులకు అప్పగించారు. నకిలీ విత్తనాలను అక్రమ రవాణా చేస్తున్న వారిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన టాస్క్​ఫోర్స్​ అధికారులు, సిబ్బందిని సీపీ రివార్డులు అందజేశారు. ఈ సమావేశంలో మంచిర్యాల డీసీపీ అశోక్​కుమార్​, అడిషనల్ డీసీపీ(అడ్మిన్) సీ రాజు, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, చెన్నూరు టౌన్ ఇన్​స్పెక్టర్​ రవీందర్, టాస్క్​ఫోర్స్​ ఇన్​స్పెక్టర్​ సంజయ్, అగ్రికల్చర్ ఏవో గ్లాడ్సన్ పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News