– ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ ఆలం
నేటి సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలో పత్తి విత్తనాలు కొనేందుకు దుకాణాలకు వచ్చిన రైతుపై ఎలాంటి లాఠీచార్జి జరగలేదని ఎస్పీ గౌస్ ఆలం స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రైతులను పోలీసులు అడ్డుకున్నారని, చెదరగొట్టారన్న విషయం అవాస్తమని చెప్పారు. రైతుల బాగు కోసం, వారికి ఎలాంటి అపాయం జరగకుండా రైతులందరినీ ఒక క్రమపద్ధతిలో ఏర్పాటు చేసేందుకు పోలీసులు విధులు నిర్వహిస్తారనే విషయాన్ని గుర్తించాలని సూచించారు. రైతులు షాపుల్లోకి దూసుకెళ్లకుండా, ప్రశాంతంగా అన్నదాతలు విత్తనాలు కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారని చెప్పారు. ఎలాంటి ఆందోళనకర పరిస్థితులు ఆదిలాబాద్లో ఏర్పడడం లేదని అన్నారు. రైతులతో తీవ్ర వాగ్వాదం, తోపులాట అనేది జరగలేదని స్పష్టం చేశారు. పోలీసులు ఏ ఒక్క రైతుపై లాఠీచార్జ్ చేయలేని తేల్చి చెప్పారు. ఇలాంటి ఆందోళనకర, అవాస్తవ వార్తలను ప్రచురించి ప్రశాంతమైన రైతులకు ఇబ్బందికర పరిస్థితిని తీసుకరావద్దని సూచించారు. అవాస్తవ వార్తలు గానీ, స్క్రోలింగ్ గానీ ప్రచురిస్తే, వారిపై చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.