నేటి సాక్షి, బెజ్జంకి: బెజ్జంకి మండలం వడ్లూరు బేగంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాఫ్ట్ బాల్ ఉచిత వేసవి శిక్షణ శిభిరంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు సిద్దిపేట జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టీ షర్ట్ లు అందించారు. క్రీడాకారులకు ఉచితంగా టీ షర్ట్ అందించిన సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు నేతి కైలాసం గుప్తకి పీఈటీ వెగ్గళ్ళం సతీష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ రమ్య, సిద్దిపేట సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రేణుక, మెదక్ జిల్లా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్యామ్ సుందర్ శర్మ, కోచ్ సుమన్ ,భాస్కర్ నవీన్ పాల్గొన్నారు.