నేటి సాక్షి, బెజ్జంకి: మండలంలోని బేగంపేట గ్రామానికి చెందిన రిటెర్డ్ టీచర్ మామిడాల పర్శయ్య మరియు బుర్ర రుక్కమ్మ ఇటీవల మరణించగా వారి కుటుంబాలను ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట పార్టీ మండల అధ్యక్షుడు రత్నాకర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు ఒగ్గు దామోదర్, స్థానిక నాయకులు తదితరులు ఉన్నారు.