నేటి సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో జూన్ ఫస్ట్ వీక్‌లోనే నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ పేర్కొన్నది. కేరళ తీర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటం.. రుతుపవనాలకు అనుకూల వాతావరణం ఏర్పడటంతో ఒకరోజు ముందే నైరుతి ఆగమనం జరిగినట్టు వాతావరణ శాఖ వివరించింది. తెలంగాణలో జూన్ రెండో వారంలో రుతుపవనాలు విస్తరిస్తాయని చెప్పింది. రుతు పవనాలు కేరళకు తాకినప్పటికీ ఉష్ణోగ్రతల్లో మార్పు ఉండదని వివరించింది. సాధారణం కంటే ఒకటి, రెండు డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా ఉంటుందని చెప్పింది.