- అదిరిపోయేలా ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తాం
- బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణరావు
నేటి సాక్షి, కరీంనగర్: పదేండ్లలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావ వేడుకలను మూడు రోజుల పాటు బీఆర్ఎల్ ఆధ్వర్యంలో అదిరిపోయేలా నిర్వహిస్తామని బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణరావు అన్నారు. గురువారం కరీంనగర్‌లోని భగత్ నగర్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, బీవినోద్ కుమార్, మేయర్ సునీల్ రావు, మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీష్‌కుమార్, సుంకె రవిశంకర్, మాజీ మేయర్ రవీదర్సింగ్, జడ్పీ చైర్మన్ విజయ, రాజన్న సిరిసిల్ల జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చల్ల హరిశంకర్, గ్రంథాలయ మాజీ చైర్మన్లు ఏనుగు రవీందర్‌రెడ్డి, పొన్నం అనీల్, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ , వీర్ల వేంకటేశ్వర్ రావు, బీఆర్ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్ మధుసూదన్ రెడ్డి, జక్కుల నాగరాజుతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కరీంనగర్ జిల్లా నుంచి వెయ్యి మంది బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో హైదరాబాద్‌కు జూన్ 1న సాయంత్రం 5:30గంటలకు గన్ పార్క్ వద్దకు వెళ్లి అక్కడి నుంచి సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపం వరకు ర్యాలీగా వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. జూన్ 2న హైదరాబాద్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండాతో పాటు గులాబీ జెండాను ఎగురవేసే కార్యక్రమంలో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. 3న కరీంనగర్ తీగలగుట్టపల్లిలోని కేసీఆర్ భవన్ ఆవరణలో జాతీయ జెండాతో పాటు బీఆర్ఎస్ జెండాను ఎగురవేయడం జరుగుతుందని, అనంతరం వివిధ సేవా కార్యక్రమాలలో పాల్గొనడం జరుగుతుందని పేర్కొన్నారు. పద్నాలుగేండ్లు కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో పదేండ్ల పాటు తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపారని పేర్కొన్నారు.