నేటి సాక్షి, కరీంనగర్: జిల్లా న్యాయ సేవా అధికార సంస్థలో రెండు రోజుల శిక్షణలో భాగంగా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్ ఆధ్వర్యంలో 9 మంది శిక్షణ న్యాయమూర్తులు గురువారం కరీంనగర్‌లోని ప్రభుత్వ బాల సదన్‌ను సందర్శించారు. సదనంలో బాలికలతో ముచ్చటించారు. అలాగే వివిధ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి ఉన్నత శిఖరాలకు ఎదగాలని శిక్షణా న్యాయమూర్తులు సూచించారు. అలాగే, శిశు గృహలోని పిల్లలను సందర్శించారు. పిల్లలకు అందుతున్న వివిధ సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ తణుకు మహేశ్, బాల సదన్ నిర్వాహకురాలు పాల్గొన్నారు.