- కరీంనగర్ డీఎంహెచ్వో సుజాత
నేటి సాక్షి, కరీంనగర్: దేశంలో పొగాకు ఉత్పత్తులైన సిగరెట్, పాన్ మసాలా, జర్దా, గుట్కా, తంబాకు, కర్ర తదితర వాటి 60శాతం మరణాలు సంభవిస్తున్నాయని కరీంనగర్ డీఎంహెచ్వో సుజాత ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ పొగాకు, పొగాకు ఉత్పత్తుల వినియోగ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం డీఎంహెచ్వో కార్యాలయంలో అవగాహన ర్యాలీ జెండా ఊపి సుజాత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పొగాకు ఉత్పత్తుల వలన అసంక్రమిక వ్యాధులైన క్యాన్సర్, రక్త పోటు, ఊపిరితిత్తుల వ్యాధులు, కార్డియో మస్కులర్ వ్యాధులు, డయాబెటిక్ వంటి దీర్ఘకాలిక రోగాలకు 60 శాతం మరణాలు సంభవిస్తున్నాయని, దీని వలన ప్రతి రోజు 3500 చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మన రాష్ట్రంలో పొగాకు ఉత్పత్తుల ఉత్పత్తి, అమ్మకం నిషేధ చట్టం కోప్టా యాక్ట్ ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో పొగతాగడం నేరమని, 18 ఏండ్లలోపు పిల్లలకు పొగాకు ఉత్పత్తుల అమ్మకం నిషేధమని తెలిపారు. కరీంనగర్ జిల్లాలో పొగాకు ఉత్పత్తుల వినియోగం వలన వచ్చే వ్యాధుల గురించి అవగాహన కార్యక్రమాలు 128 విద్యా సంస్థల్లో, 148 గ్రామాల్లో నిర్వహించినట్టు చెప్పారు. అలాగే, రైల్వే స్టేషన్, బస్టాండ్, పాఠశాలల్లో పొగాకు వ్యతిరేక హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశామన్నారు. ఈ అవగాహన ర్యాలీలో టీబీ జిల్లా అధికారి డాక్టర్ కేవీ రవీందర్రెడ్డి, ఎంసీహెచ్ పీవో డాక్టర్ సనా జవేరియా, ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ డాక్టర్ శిల్ప, ఎస్వో ఆర్ఎల్ కాంతారావు, డీపీసీ కో–ఆర్డినేటర్ సీహెచ్ రంగారెడ్డి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.