- కాంగ్రెస్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అల్లూరి శ్రీనాథ్‌రెడ్డి
నేటి సాక్షి, గన్నేరువరం: అనేక బలిదానాల మూలంగాణ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని కాంగ్రెస్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అల్లూరి శ్రీనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలం కేంద్రంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ సాధించడం అనేది ఎన్నో సంవత్సరాల కల అని, ఉద్యమంలో సుమారు 1200 మందికి పైగా అమరుల బలిదానంతో తెలంగాణ సహకారం అయ్యిందని అన్నారు. తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయనే ఉద్దేశంతో తెలంగాణ సాధించుకున్నట్టు చెప్పారు. ఆ రోజు సోనియా గాంధీ ప్రత్యేక రాష్ర్టం ఇచ్చారని గుర్తు చేశారు. 2న హైదరాబాద్‌లో జరిగే రాష్ర్ట ఆవిర్భా వేడుకలకు సోనియా ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారని చెప్పారు. మానకొండూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్టు ఆయన చెప్పారు.